పోసాని మనసు మార్చుకుంటారా?

మరోసారి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం పోసాని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే టైమ్ లో ఆయన ఆలోచనలో పడ్డారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ఇదివరకే ప్రకటించారు 67 ఏళ్ల పోసాని కృష్ణమురళి. ఇప్పుడా నిర్ణయంపై ఆయన పునఃసమీక్షిస్తున్నారేమో అనిపిస్తోంది.

రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ ఆయన్ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా ఆయనపై 30 ఆరోపణలు రాగా, 11 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇక అక్కడ్నుంచి జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఒక్కో కేసు యాక్టివ్ అయ్యాయి. పీటీ వారెంట్ కింద పోసానిని వివిధ పోలీస్ స్టేషన్లు అతడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ లో పెట్టాయి. ఒక దశలో సీఐడీ కూడా రంగంలోకి దిగి పోసానిని జైలు నుంచి బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేసింది.

అలా 24 రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసాని, ఎట్టకేలకు తనపై ఉన్న యాక్టివ్ కేసుల నుంచి బెయిల్ పై బయటకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది.

పోసానిపై నమోదైన ఈ కేసులు ఇప్పట్లో తేలేవి కావు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది. బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత ఇప్పటివరకు మీడియాతో మాట్లాడలేదు పోసాని. ఆయన ఏం ఆలోచిస్తున్నారు.. ఆయన మనసులో ఏముందో త్వరలోనే బయటకొస్తుంది.

6 Replies to “పోసాని మనసు మార్చుకుంటారా?”

  1. ‘రే సానిగా, నీలాంటి వాళ్ళు ఎంత ఆక్టివ్ గా ఉంటే, టీడీపీ శ్రేణులు యునైట్ గా ఉండడానికి అంత మంచిది.. So నువ్వు మనసు మార్చుకోవాలి మునుపటిలా షర్ట్ ఎగిరేస్తూ ఉండాలి.

  2. Why this author is showing his sadism on Posani and anna?. If Posani talks in his usual manner, anna will be begging for the opposition status again even after 2024 elections. This time Posani will not even get bail. Neeku enduku anna ante anta kopam?

Comments are closed.