పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మలో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. తనను గౌరవించకపోయినా వర్మ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ లక్షలాది మంది చూస్తుండగా, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సొంత అన్న, జనసేన కీలక నాయకుడు నాగబాబు తీవ్రంగా అవమానించడాన్ని వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు.
పవన్‌ను గెలిపించింది తామే అని ఎవరైనా అనుకుంటే, అది వాళ్ల ఖర్మ అని నాగబాబు చెప్పిన ఆ క్షణమే, పవన్‌కల్యాణ్ అంతు చూడాలని వర్మ డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను వర్మ వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారు. పిఠాపురాన్న అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గాలికి వదిలేశారనే సంకేతాల్ని జనంలోకి పంపి, తద్వారా అప్రతిష్టపాలు చేయాలని వర్మ తెలివిగా నడుచుకుంటున్నారు.
ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పారిశుధ్యం అధ్వానంగా వుందని, దీంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని వర్మ ఆరోపించారు. వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతూ కాకినాడ కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం ఇవ్వడం గమనార్హం. పేరుకు అధికారులు పట్టించుకోలేదని వర్మ విమర్శిస్తున్నప్పటికీ, ఆయన టార్గెట్ చేస్తున్నది తమనే అని పిఠాపురం జనసేన నాయకులు కోపంగా ఉన్నారు. వర్మ రాజకీయాల గురించి తమకు బాగా తెలుసని, ఎవరినైనా టార్గెట్ చేయాలంటే, ఆయన ఈ రకంగానే చేస్తారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను నేరుగా విమర్శించలేక, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించడం ద్వారా, తానే దిక్కు అని నియోజకవర్గ ప్రజలకు ఆయన సంకేతాలు పంపుతున్నారని జనసేన నేతలు అంటున్నారు. తాము కూడా వర్మకు తగిన రీతిలో కౌంటర్ ఇస్తామని వాళ్లు హెచ్చరిస్తున్నారు. వర్మను కరివేపాకులా తీసి పడేయడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులేంటో నాగబాబు గ్రహించాల్సిన అవసరం వుంది.
Manchi pane Kada andulo Pawan Ni target amundi
Ala ante yela bro y cheap batch dega great andhra page yedokati puttinchakapote yevarnaina chapakapote nidra pattadhu yedho raasukuni anandha padutunnaru just sunakanandam anthe
Edhi nayam, mana jaggu bayyanu toilet tissue lekkana vadesukontumnranta..i mean Indian tissue kadu western tissue.
ఓహో…అంటే మండలి లో బొత్స అండ్ బ్యాచ్ చాలా ప్రశ్నలు అడిగారు…అంటే అవన్నీ గత ప్రభుత్వంలో చెయ్యలేదు అనేగా….ఆ విధంగా బొత్సా జగన్ ని టార్గెట్ చేసినట్లేనా?
పాము బిళ్ళ ముసలం అవుతుందా
varma fans association pettuko… roju varma ni thalachukovadame…
వర్మ గారికి క్లారిటీ వుంది భవిష్యత్తులో వుండే పార్టీ లు టీడీపీ జనసేన మాత్రమే వైసీపీ దుకాణం క్లోజ్ అని పోటీ పడే పార్టీలు టీడీపీ జనసేన మాత్రమే ఆయనే టీడీపీ అభ్యర్థిగా కూడా వుంటారు వైసీపీ పెద్దలు దేశం వదిలిపోవటం లేదా ఏదొక పార్టీ లో చేరటమో చేయవలసిందే