నాయ‌కులు పార్టీ మారితే వైసీపీ బ‌ల‌హీన‌ప‌డుతుందా?

పార్టీ బ‌ల‌మే త‌ప్ప‌, ఇప్ప‌టి నాయ‌కుల‌కు వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉండ‌డం లేదు. ఒక‌ప్పుడు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఎక్కువ మందే గెలిచేవాళ్లు.

ఇటీవ‌ల కాలంలో వైసీపీ వీడే వాళ్ల‌ను చూస్తున్నాం. ముఖ్యంగా వైసీపీని , ఆ పార్టీ ద్వారా సంక్ర‌మించిన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని విజ‌య‌సాయిరెడ్డి వ‌దులుకున్నారు. అయితే ఆయ‌న మాత్రం రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మాట‌మీదే ఉంటారా? భ‌విష్య‌త్‌లో త‌న నిర్ణ‌యాన్ని విజ‌య‌సాయిరెడ్డి మార్చుకుంటారా? అనేది కాలం తేల్చాల్సిన అంశం. అలాగే మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి మూడు నెల‌ల క్రితం రాజీనామా చేశారు. ఈ మ‌ధ్యే చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు.

వైసీపీని వీడిన నాయ‌కుల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి, ఇంకా చిన్నాచిత‌కా నాయ‌కులున్నారు. దీంతో వైసీపీ ప‌ని అయిపోయిందంటూ కూట‌మి నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీ అనే కాదు, ఏ రాజ‌కీయ పార్టీ అయినా నాయ‌కుల్ని న‌మ్ముకుని వుండ‌వు. ప్ర‌ధానంగా కార్య‌క‌ర్త‌ల‌పై పార్టీ నిర్మాణం ఆధార‌ప‌డి వుంటుంది. అధికారంలో లేని పార్టీని వీడ‌డం స‌హ‌జం.

2019 లేదా 2024లో టీడీపీ, లేదా వైసీపీని వీడిన‌, వీడుతున్న నాయ‌కులున్న‌ప్ప‌టికీ… ఆ పార్టీలు ఓడిపోయాయ‌ని గుర్తించుకోవాలి. తునిలో లేదా మ‌రో మున్సిపాల్టీలో, కార్పొరేష‌న్‌లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పెద్ద సంఖ్య‌లో పార్టీని వీడినంత మాత్రాన‌… ఏదో అంతా అయిపోయింద‌ని అనుకుంటే, అంత‌కంటే అజ్ఞానం మ‌రొక‌టి వుండ‌దు. కాక‌పోతే రాజ‌కీయంగా మైండ్‌గేమ్ ఆడ‌డానికి ఇలాంటివి ప‌నికొస్తాయి.

ప‌రిపాల‌న‌పై మ‌రోసారి అధికారంలోకి రావ‌డం లేదా గ‌ద్దె దిగ‌డం ఆధార‌ప‌డి వుంటుంది. హామీల అమ‌లు, అలాగే అభివృద్ధి చేయ‌డాన్ని అనుస‌రించి ప్ర‌జాభిమానం లేదా వ్య‌తిరేక‌త వుంటాయి. పాల‌న చేస్తున్న నాయ‌కుల‌కు తామేం చేస్తున్నామో గ‌మ‌నంలో వుండాలి. లేక‌పోతే ప్ర‌భుత్వం మున‌గ‌డం ఖాయం. ఎంతో పెద్ద నాయ‌కుల‌నే చెప్పుకునే వాళ్ల‌కు కూడా గ‌ట్టిగా వెయ్యి ఓట్లు కూడా వుండ‌వు.

పార్టీ బ‌ల‌మే త‌ప్ప‌, ఇప్ప‌టి నాయ‌కుల‌కు వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉండ‌డం లేదు. ఒక‌ప్పుడు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఎక్కువ మందే గెలిచేవాళ్లు. ఇప్పుడా ప‌రిస్థితి వుండ‌డం లేదు. పార్టీ టికెట్ ఇస్తేనే , ఎవ‌రికైనా ప‌ది ఓట్లు రాలుతాయి. కావున జంపింగ్‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని గ్ర‌హించి, మంచి పాల‌న అందించ‌డంపై దృష్టి సారిస్తే, అధికారంలో ఉన్న‌వాళ్ల‌కు అన్ని విధాలా క‌లిసొస్తుంది.

12 Replies to “నాయ‌కులు పార్టీ మారితే వైసీపీ బ‌ల‌హీన‌ప‌డుతుందా?”

  1. వీడు మళ్ళి మొదలు పెట్టాదు!! Y.-.C.-.P ని నాయకులు వీడితె Y.-.C.-.P నష్టం కాదు, TDP కె నష్టమా???

  2. ప్రతీ పార్టీ లో గోడదూకుళ్ళు ఉంటాయ్.. ఇవన్నీ very common.

    లెవెనన్నోయ్.. నువ్వేమి ఇవన్నీ పట్టించుకోబాకు, మన పార్టీ నాయకులు సొంతంగా కనీసం 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని ‘ఎదవలు.. వాళ్ళు కూడా నిన్ను ‘బ్లాక్ ‘మెయిల్ చేస్తున్నారు..

    మన ఓటర్లు ‘EVM లు..

    నువ్వు అపద్దాలుచెప్పకపోవడం, నీ అతి నిజాయితీ, మన అతి మంచితనం తో ఓ 5 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుని .. ‘EVM ల జపం చేస్తే చాలు 175/175 మెజారిటీ తో అధికారం తన్నుకుంటూ అదే వస్తది..

    పోయేవాళ్ళని Just leave them డా..

  3. నీ రాత ల్లో ఏదో బాధ ఉంది..

    నీ మనసులో ఎదో చెప్పుకోలేని వెలితి ఉంది..

    నీ మాట లో పూడ్చలేనంత అగాధం ఉంది..

    నీ ఆలోచన ల్లో అలవిగాని ఆశలు ఉన్నాయి..

    ..

    మొత్తానికి జగన్ రెడ్డి ని అధికారం లో లేకుండా.. ఊహించుకోలేకపోతున్నావు ..

    ఒకసారి నాయకుల వల్లే జగన్ రెడ్డి ఓడిపోయాడు అంటావు.. ఇంకోసారి నాయకుల వల్ల గెలుపోటములు ప్రభావితం కావు అంటావు..

    టీడీపీ పైన 6 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత అంటావు.. వైసీపీ పైన ఇంతటి వ్యతిరేకతని ఐదేళ్లు కనిపెట్టలేకపోయావు..

    ఒకసారి లోకేష్ కోసం పవన్ ని బలిపెడుతున్నారు అంటావు.. ఇంకోసారి పవన్ కి ప్రభుత్వం లో ప్రాధాన్యత పైన టీడీపీ క్యాడర్ అసహనం గా ఉంది అని రాస్తావు..

    ..

    మనిషి గా పుట్టావు కాబట్టి.. దేవుడు నీకు ఆలోచన శక్తి ని ఇచ్చే ఉంటాడు..

    అది వాడకపోతే.. నీకు, జంతువు కి తేడా ఉండదు..

    జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో నీకు 8 నెలలైనా అవగాహన లేదు.. మళ్ళీ ఎలా గెలవగలడో ఒక ఆలోచన లేదు..

    30 ఏళ్ళు అధికారం మాదే అనే గుడ్డి నమ్మకాన్ని పెంచుకొంటున్నావు..

    తిని పడుకుంటే.. కొండలైనా కరిగిపోతాయి.. నీ జగన్ రెడ్డి 11 సీట్లు తరిగిపోవడం ఎంతసేపు..

  4. “కావున జంపింగ్‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని గ్ర‌హించి, మంచి పాల‌న అందించ‌డంపై దృష్టి సారిస్తే, అధికారంలో ఉన్న‌వాళ్ల‌కు అన్ని విధాలా క‌లిసొస్తుంది”…If che ddi batch is advising TDP then its hurting them

  5. అధికారం లో లేని పార్టీ నీ వీడటం సహజం

    నేతలు వీడినంత మాత్రాన పార్టీ బలహీన పడిపోదు.

    ఈ డైలాగ్స్ కేవలం వైసిపి కి మాత్రమే వర్తిస్తాయి అన్న మాట.

    అదే టీడీపీ నీ జనసేనా నీ ఒక్కల్లు వీడినా అప్పట్లో ఎలా రాసే వాడివి?

    దుకాణం సర్డుకొనున్న టీడీపీ

    పార్టీ మూసేయనున్న జనసేన

    ఇలా రాయాలి కదా

    అద్భుతమైన న్యూట్రల్ జర్నలిజం కదా?

  6. అధికారం లో లేని పార్టీ నీ వీడటం సహజం

    నేతలు వీడినంత మాత్రాన పార్టీ బలహీన పడిపోదు.

    ఈ డైలాగ్స్ కేవలం వైసిపి కి మాత్రమే వర్తిస్తాయి అన్న మాట.

    అదే టీడీపీ నీ జనసేనా నీ ఒక్కల్లు వీడినా అప్పట్లో ఎలా రాసే వాడివి?

    దుకాణం సర్డుకొనున్న టీడీపీ

    పార్టీ మూసేయనున్న జనసేన

    ఇలా రాయాలి కదా

  7. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ వచ్చేటోళ్ళకి కిరాటాలు తొడగడం లేదు వాళ్లకు వచ్చే ఎన్నికలలో వైసీపీ దుకాణం బంధ అవడం ఖాయమని టీడీపీ కో జనసేన కో వెళితే నెక్స్ట్ ఎలక్షన్ లలో టికెట్ ఇస్తారని ఆశ తో వెళుతున్నారంతే కానీ ఒకటి మాత్రం మీరు చెప్పేది నిజం వీళ్ళు వెళ్లిన రిజల్ట్స్ లో తేడా రాదు కానీ జగన్ గారి పాలనా cbn గారి పాలనా చూసే ఇప్పుడు తీర్పు ఇచ్చేరు అది గ్రహించే గోడ దూకుళ్లు

Comments are closed.