కూటమికి చిక్కని వైసీపీ

విశాఖ మేయర్ పీఠం రాజకీయాలు సమ్మర్‌ని మించి హీటెక్కించేస్తున్నాయి.

విశాఖ మేయర్ మీద అవిశ్వాసం అన్నది కూల్ సిటీని హీటెక్కించేస్తోంది. వైసీపీకి నిండా ఐదేళ్ల పదవీకాలం దక్కకూడదని, చివరి ఏడాది అధికారం తమ చేతిలో ఉంచుకుంటే ఆ కిక్కే వేరు అన్న లెక్కతో కూటమి మేయర్‌ను దించే కార్యక్రమం చేపట్టింది.

విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ మేయర్‌ను గద్దె దించి టీడీపీ మేయర్‌ను ప్రతిష్టించాలని గట్టిగా సంకల్పించింది. అయితే ఇదంతా జరగాలి అంటే అంకెలు అనుకూలించాలి. కూటమి గద్దెనెక్కాలి అంటే మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలి.

అది జరగాలి అంటే అవసరమైన కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. కూటమికి దాదాపుగా బలం ఉంది, కానీ తేడా వస్తే ఇద్దరో ముగ్గురో కార్పొరేటర్ల అవసరం పడుతుందని అంటున్నారు. దాంతో, ఆ కార్పొరేటర్లను వైసీపీ నుంచే తీసుకోవాలి.

ఇప్పటికే కూటమి వైపుగా జరిగిన జంపింగులతో సగానికి పైగా బలం కోల్పోయిన వైసీపీ, చివరాఖరులో రాజకీయ తెలివి తెచ్చుకుని ప్రత్యేక క్యాంప్ పాలిటిక్స్‌కి తెర తీసింది. తమకు కచ్చితంగా ఉన్నారనుకున్న 28 మంది కార్పొరేటర్లతో “చలో ఊటీ” అని క్యాంప్‌ని పెట్టేసింది.

దాంతో, కూటమికి అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం దక్కుతుందా? వైసీపీ నుంచి ఇంకా ఎవరైనా చిక్కుతారా? అన్న పాయింట్ ఇప్పుడు విశాఖ రాజకీయాలను ఊపేస్తోంది. వైసీపీ నుంచి కొత్తగా కూటమి వైపు వెళ్లే వారు ఎవరూ లేరని, అంతే కాకుండా కూటమి వైపు వెళ్లిన వారు కూడా తమకు టచ్‌లో ఉన్నారని, వారు ఈ వైపుకే వస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వ్యవహారం చూడబోతే, అప్పట్లో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో కుప్పకూలిన రాజకీయ అనుభవాన్ని గుర్తుకు తెస్తోందని అంటున్నారు. ఇప్పుడు కూడా ఒకటి రెండు ఓట్లే విశాఖ మేయర్ జాతకాన్ని మార్చేస్తాయని అంటున్నారు. దాంతో, విశాఖ మేయర్ పీఠం రాజకీయాలు సమ్మర్‌ని మించి హీటెక్కించేస్తున్నాయి.

32 Replies to “కూటమికి చిక్కని వైసీపీ”

  1. కూటమి కి పోరిగింటి పుల్లకూర ఎందుకో అంత రుచి.. పొద్దులెగిస్తే ycp మీద పడి ఏడ్చే కూటమి ముఠా కు ycp carporates మాత్రం కావాలి

  2. పేటీఎం గ్రేట్ ఆంధ్ర ఇంకా నీవు ఎన్ని రోజులు భజన చేస్తావ్ అవునులే ఇంకా పేమెంటు ఇంకా ఉంటుంది కాబట్టి భజన చేయాల్సి వస్తుంది లేకపోతే మీకు గగన్ మామయ్య భజన చేస్తాడు

  3. Papam googlepay kukkaliki lokesh kukka biscuit lu vesthuna vuntadu andhuku antey a kukkalu ikkada commentlu CHESI lokesh ni annada pettali kadha googlepay kukkalu recvhipondi r ainka meeku me epllaliki kuda intiki pampistha kukka biscuitlu tammulu moragandi veedi meedha

Comments are closed.