కొన్నేళ్ల కిందటి సంగతి. చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్ లో సినిమా అన్నారు. ఒక టైమ్ లో చిరంజీవి కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పేశారు. కట్ చేస్తే, ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. భోళాశంకర్ ఫ్లాప్ అవ్వడంతో, చిరంజీవి ఆ సినిమా ఆపేశారనే ప్రచారం నడిచింది.
సినిమా ఆగిపోయిందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ.. ఈ ప్రాజెక్టుపై ఎవ్వరూ స్పందించలేదు. ఎట్టకేలకు వెంకీ కుడుముల రెస్పాండ్ అయ్యాడు. చిరంజీవితో సినిమా ఆగిపోవడానికి ప్రత్యేక కారణాలేం లేవని, అనుకున్న విధంగా కథ రాకపోవడం వల్లనే ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపాడు.
ముందుగా చిరంజీవికి ఓ ఐడియా చెప్పాడట వెంకీ కుడుముల. అది చిరంజీవికి బాగా నచ్చిందట. డెవలప్ చేయమని చెప్పారట. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన వెంకీ, చాలా టైమ్ తీసుకొని కథ డెవలప్ చేశాడట.
అయితే ఎత్తుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, రాసుకున్న కథతో చిరంజీవిని సంతృప్తి పరచలేకపోయానని, అందుకే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని అంటున్నాడు వెంకీ కుడుముల. మరో కథతో ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేస్తానని చెబుతున్నాడు.
Comedy