కత్రినా కైఫ్ పై కొత్త రకం ట్రోలింగ్!

పెళ్లి, పిల్లలు అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. మొన్నటివరకు పెళ్లి చేసుకోలేదంటూ ఆమెపై పోస్టులు పెట్టారు. ఇప్పుడు పిల్లల్ని కనమంటున్నారు.

దీపిక పదుకోన్ బిడ్డకు జన్మనిచ్చింది. కియరా అద్వానీ ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అతియా శెట్టి కూడా తల్లయింది. ఇంకాస్త వెనక్కు వెళ్తే అలియాభట్ లాంటి చాలామంది హీరోయిన్లు మాతృత్వాన్ని ఆస్వాదించారు. మరి కత్రినా కైఫ్ సంగతేంటి?

కత్రినా కైఫ్ కూడా తల్లయితే చూడాలనుకుంటున్నట్టు చాలామంది పోస్టులు పెట్టడం విడ్డూరం. విక్కీ కౌశల్ ను పెళ్లాడి చాలా ఏళ్లయిందని, వెంటనే ఆ తీపి కబురు కూడా అందించాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

పెళ్లి, పిల్లలు అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. మొన్నటివరకు పెళ్లి చేసుకోలేదంటూ ఆమెపై పోస్టులు పెట్టారు. ఇప్పుడు పిల్లల్ని కనమంటున్నారు. సోషల్ మీడియాలో ఈ చర్చ మొదలవ్వడానికి కారణం సల్మాన్ ఖాన్.

కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ తో మరోసారి నటిస్తారా అనే ప్రశ్నపై స్పందిస్తూ… ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైందని, పిల్లలు పుడితే చూడాలని ఉందంటూ కామెంట్ చేశాడు.

ఇక అక్కడ్నుంచి కత్రినా కైఫ్ వైవాహిక బంధంపై చర్చ మొదలైంది. త్వరగా గర్భం దాల్చి వైవాహిక బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ ఆమెకు సోషల్ మీడియాలో ఉచిత సలహాలిస్తున్నారు చాలామంది. ప్రస్తుతం కత్రినాకైఫ్ వయసు 41 సంవత్సరాలు.

4 Replies to “కత్రినా కైఫ్ పై కొత్త రకం ట్రోలింగ్!”

Comments are closed.