హవ్వ.. వీటికి కూడా రేట్లు పెంచుతారా?

ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలుంటే చాలు, సినిమా ఎంత చిన్నదైనా రేట్లు పెంచుకోవచ్చని నిరూపించాయి

కల్కి, సలార్, గేమ్ ఛేంజర్, పుష్ప-2.. ఇలా కొన్ని పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచారు. ఆ సినిమా బడ్జెట్స్ చాలా ఎక్కువ కాబట్టి పెంచారు అనుకోవచ్చు. మరి మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ లాంటి సినిమాలకు ఎందుకు టికెట్ రేట్లు పెంచారు..

ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలకు రికవరీ అయ్యేందుకు, చిన్నపాటి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తాయి. ఇన్నాళ్లూ అందరికీ ఇలానే చెబుతూ వచ్చారు. కానీ మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ సినిమాలకు ఎందుకు పెంచారనేది అర్థంకాని విషయం.

బహుశా.. బడ్జెట్ తో సంబంధం లేకుండా హైప్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు తీసుకొచ్చారేమో. ఈ రెండు సినిమాలపై ప్రస్తుతం మంచి హైప్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇలా టికెట్ రేట్లు పెంచి ఉంటారు.

పెంచింది 75 రూపాయలే కదా.. దానికి ఇంత రాద్దాంతం ఎందుకు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఇక్కడ సమస్య 50 రూపాయలు పెంచారా.. 75 రూపాయలు పెంచారా అనేది కాదు. అసలు ఎందుకు పెంచారనేది ఇష్యూ.

మ్యాడ్ స్క్వేర్ చిన్న సినిమా అనే సంగతి అందరికీ తెలుసు. ఇక రాబిన్ హుడ్ సినిమాకు కూడా నితిన్ మార్కెట్ కు తగ్గట్టే బడ్జెట్ పెట్టారు. కాకపోతే ఇంకాస్త ఎక్కువ ఖర్చయింది. అంతేతప్ప, అది భారీ బడ్జెట్ సినిమా కాదు, భారీగా గ్రాఫిక్స్ ఉపయోగించిన మూవీ అంతకంటే కాదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచేశారు.

ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలుంటే చాలు, సినిమా ఎంత చిన్నదైనా రేట్లు పెంచుకోవచ్చని నిరూపించాయి ఈ వీకెండ్ రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు.

10 Replies to “హవ్వ.. వీటికి కూడా రేట్లు పెంచుతారా?”

  1. రాబిన్ హుడ్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారిది.

    మైత్రి మూవీ మేకర్స్ మన డిప్యూటీ సీఎం గారి తాలుకా

  2. జీవిత కాలం అభిక టికెట్ రేట్లు ఉండవు…. మొదటి వారం ఉంటాయి…. మహా అయితే మరో వారం ఉండొచ్చు…. సినిమా రిలీజ్ అయినా 15 వ రోజు ఆ పేద వాడు సినిమా చూడొచ్చు…. ప్రజలు సినిమా టిక్కెట్ల కోసం ఓట్లు వెయ్యరు అని 2024 ఎన్నిక చూసాక కూడా అర్ధం కాకపోతే ఏమి చేయలేము….

  3. జగన్ అన్న ఉండుంటే ఈ టిక్కట్ ధరలు పెరిగేవి కాదు

    డబ్బున్నోడు ఇంకా డబ్బు సంపాదించు కోవడానికే చంద్రబాబు పేదలకు, మధ్య తరగతి వాళ్ళకు పనికిరాడు

Comments are closed.