కూట‌మి పాల‌న‌పై ఉపాధి కూలీలు ఏమ‌నుకుంటున్నారంటే?

ఉపాధి ప‌నులకు వెళ్లే కూలీల మ‌న‌సుల్లో ఏముందో తెలిస్తే, ప్ర‌భుత్వం షాక్ అవ్వాల్సిందే.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి ప‌ది నెల‌లు కావ‌స్తోంది. పాల‌న‌పై అప్పుడే ప్ర‌జ‌ల్లో నిట్టూర్పు. ముఖ్యంగా వివిధ ర‌కాల ఉద్యోగులు విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద వ‌రుస ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉద్యోగుల‌కు యూనియ‌న్లు వుండ‌డంతో వాళ్లంతా ఒక్క పిలుపుతో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతారు. కానీ రైతులు, సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి అలా లేదు. కూట‌మి పాల‌న‌పై గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏముంది? అనేది తెలుసుకుంటే, ప్ర‌భుత్వ ప‌నితీరు అంచ‌నా క‌ట్టొచ్చు.

ముఖ్యంగా ఉపాధి ప‌నులకు వెళ్లే కూలీల మ‌న‌సుల్లో ఏముందో తెలిస్తే, ప్ర‌భుత్వం షాక్ అవ్వాల్సిందే. ఉపాధి ప‌నులు జ‌రిగే చోట ప్ర‌భుత్వ ప‌నితీరుపై కూలీలు బ‌హిరంగంగానే త‌మ మ‌న‌సులో మాట‌ల్ని బ‌య‌టికి వెల్ల‌డిస్తున్నారు.

సూప‌ర్‌సిక్స్ పేరుతో జ‌గ‌న్ కంటే ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లిగిస్తామంటే… అంద‌రం చంద్ర‌బాబుకే ఓటు వేశామ‌ని అంటున్నారు. కానీ చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత, పింఛ‌న్ పెంచ‌డం త‌ప్ప‌, ఒక్క‌టంటే ఒక్క మంచి ప‌ని చేయ‌లేద‌ని ఉపాధి కూలీలు అనుకుంటున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ హ‌యాంలో ఏదో ఒక సంక్షేమ ప‌థ‌కం పేరుతో త‌మ ఖాతాల‌కు డ‌బ్బు వేసేవాడ‌ని, చేతిలో ఎప్పుడూ ప‌ది రూపాయ‌లు తిల్లాడేద‌ని అంటున్నారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి అస‌లే లేద‌ని తిట్టిపోస్తున్నారు.

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత లెక్క లేక‌పోవ‌డంతో చేతులు బోసిపోయాయ‌ని ఉపాధి కూలీలు వాపోతున్నారు. త‌ల్లికి వంద‌నం కింద ఎంత మంది పిల్ల‌లుంటే, అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడ‌ని, ఆ లెక్క ఏమైందో ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అట్ల‌నే, ప్ర‌తి రైతుకు సంవ‌త్స‌రానికి రూ.20 వేలు ఇస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఓట్లు వేయించుకుని, రేపు, మాపు అంటూ వాయిదాలు వేశాడ‌ని మండిప‌డుతున్నారు.

ఇక ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణంపై అయితే సెటైర్ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ముఖ్యంగా మ‌హిళ‌లు దెప్పి పొడుస్తున్నారు. ఉపాధి కూలీలంటే… రెక్కాడితే గాని డొక్కాడ‌ని బ‌తుకు జీవులు. అలాంటి వాళ్ల మ‌న‌సుల్లో చంద్ర‌బాబు స‌ర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వుంద‌న్న‌ది వాస్త‌వం. దీని నుంచి బ‌య‌ట ప‌డాలంటే చంద్ర‌బాబు స‌ర్కార్ హామీల్ని అమ‌లు చేయ‌డంలో చిత్తుశుద్ధిని చాటుకోవాలనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

17 Replies to “కూట‌మి పాల‌న‌పై ఉపాధి కూలీలు ఏమ‌నుకుంటున్నారంటే?”

      1. ప్రభుత్వం పనిచెయ్యడం లేదు. అందుకే అడుగుతున్నా ప్రతి పక్షం ఏం చేస్తోంది అని. సరైన ప్రతి పక్షం లేకపోతే పాలన ఎలా వస్తుంది? కేవలం అధికారం పాత్ర మాత్రమే పోషిస్తాం, ప్రతి పక్షం లో ఉంటే కళ్ళు మూసుకొని 5 సంవత్సరాల పాటు గడిపేస్తాం అన్నది మీ విధానం కాబోలు

  1. noru mooyi ra GA. Public want development they dont want these pathakaalu. Kootami develop chestundi ani vesaru anthe gaani super six istundi ani kaadu. Government should take care of employees first. PRC constitute cheyandi sir. That is the first step towards development in state.

  2. పిల్లలను స్కూల్స్కూ కి పంపితే డబ్బిస్తాననడం తప్పు రోడ్స్ వంటివి వేయకుండా జగన్ గారు ఓట్లు కొనే ప్రోగ్రామ్ కి తెర లేపాడు స్కూల్ల్ లలో డ్రాప్ అవుట్ లు ఎక్కువగా అమ్మాయిలు వుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాలి దానితో భవిష్యత్తు తల్లులకు విద్యవుంటే దేశములో విద్య పెరుగుతుంది అబ్బాయిల తల్లిదండ్రులకు ఇవ్వక్కరలేదు కాకపోతే స్కూల్ ను అభివృద్ధి పరచాలి స్కూల్ లలో పిల్లలకు మంచి ఆహారం దుస్తులు ఇవ్వాలి

  3. upadhi kuleelu emi chebuthunnarante , tata power group shares 3% perigayi anta CBN valana….world wonder…kani ikkada cheppindi upadhi kuleelu kadu ..kutami kaboye leader Lokesh garu…

  4. నీకన్నా ఎర్రి ప*** గాడు ఈ భూప్రపంచంలో భూతద్దం వేసి వెతికినా దొరకడేమో . ఎందుకంటే ఎన్నికల ముందు మీ వైసీపీ వాళ్లు మీరు మాకు ఓటు వేయకపోతే ప్రస్తుతం మన బతకాలని బంద్ అయిపోతాయని బ్లాక్మెయిల్ చేశారు జ్ఞాపకం ఉందా లేదా . నీ బోడి పథకాలు మాకు అక్కర్లేదు ఈ రాక్షస పాలన అంతమైతే చాలు అని చంద్రబాబుకు ఓటు వేశారు రా ఎర్రి పూక . ఆ మాత్రం కూడా తెలియని వేదవి నువ్వు ఒక ఛానల్ ని ఎలా రన్ చేస్తున్నావ్ రా

Comments are closed.