ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని క‌మ్మిన జూదం ‘మ‌బ్బు’

ఆధ్యాత్మిక న‌గ‌రంలో బ‌హిరంగంగా జూద గృహాల్ని నిర్వ‌హించ‌డం చూస్తే, ప్ర‌భుత్వం ఏమైనా లైసెన్స్‌లు ఇచ్చిందా?

ప్ర‌పంచ ప్ర‌సిద్దిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిని జూదం “మ‌బ్బు” క‌మ్మింది. న‌గ‌రానికి చెందిన టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఆయ‌న ప్ర‌ధాన వ‌న‌రు జూద కేంద్ర నిర్వ‌హ‌ణే కావ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. అలాగే టీటీడీ మాజీ ఉద్యోగి, ప్ర‌ధానంగా ఒక సామాజిక వ‌ర్గానికి నాయ‌కుడిగా చెలామ‌ణి అవుతూ, కూట‌మి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ‌ర‌ద‌రాజ‌న‌గ‌ర్‌లో ఏకంగా త‌న నివాసంలోనే జూదాన్ని న‌డుపుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

మాజీ ఎమ్మెల్యే కుమారుడు తిరుప‌తి ఆర్టీసీ బ‌స్టాండ్ ఎదురుగా లాడ్జీలో జూద గృహాన్ని య‌థేచ్ఛ‌గా నిర్వ‌హిస్తూ, భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్న‌ట్టు టీడీపీ నాయ‌కులే ఆరోపిస్తున్నారు. ఈ జూద గృహానికి న‌గ‌రంలోని ప‌లువురు ప్ర‌ముఖులు వెళ్తున్నార‌ని తెలిసింది. మ‌రీ ముఖ్యంగా ఈ జూద గృహానికి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్ కూత‌వేట దూరంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ పోలీసులు అటువైపు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో వాళ్ల‌కే తెలియాలి.

టీటీడీ మాజీ ఉద్యోగి నిర్వ‌హించే జూద గృహానికి న‌గ‌రానికి చెందిన సినీ నిర్మాత‌తో పాటు ప‌లువురు టీటీడీ మాజీ, స‌ర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు వెళ్తున్నార‌ని తెలిసింది. ఆధ్యాత్మిక న‌గ‌రంలో బ‌హిరంగంగా జూద గృహాల్ని నిర్వ‌హించ‌డం చూస్తే, ప్ర‌భుత్వం ఏమైనా లైసెన్స్‌లు ఇచ్చిందా? అనే అనుమానం క‌లుగుతోంది.

ఇప్ప‌టికే తిరుప‌తి జిల్లాలోనే అత్య‌ధికంగా ఇదే ఆధ్మాత్మిక న‌గ‌రంలో మ‌ద్యం దుకాణాలున్నాయి. టీటీడీ అంటే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అనే సంగ‌తిని పాల‌కులు మ‌రిచిన‌ట్టున్నారు. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమ‌ల పాదాల చెంత తిరుప‌తి ఉంద‌నే వాస్త‌వాన్ని విస్మ‌రించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. మ‌రీ ముఖ్యంగా తిరుమ‌ల శ్రీ‌వారు త‌మ ఇంటి దేవుడ‌ని , త‌న‌కు చాలా భ‌క్తి ఉన్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు.

మ‌రి తిరుప‌తిలో అసాంఘిక కార్య‌క‌లాపాలు… సీఎంకు తెలిసి లేదా తెలియ‌క జ‌రిగినా, అంతిమంగా ఆయ‌న ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇలాంటివి న‌గ‌రంలో వుండేవి కావు. ఇప్పుడు విచ్చ‌ల‌విడి కావ‌డాన్ని ప్ర‌జ‌లు త‌ప్పు ప‌డుతున్నారు. కావున జూద గృహాల‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. తిరుప‌తిని చెర‌ప‌ట్టిన జూద “మ‌బ్బు”ను విడిపించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై వుంది.

5 Replies to “ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని క‌మ్మిన జూదం ‘మ‌బ్బు’”

  1. mee ycp rojakka karunanna chevanna veella dharidhram kannna ippudu tirupathi bagundhi. nuvvu akkadekkado kurchoni ikkada maa tirupathi news rayoddhu baabu

  2. తిరుమల ని ఎవరు అపవిత్రం చేసినా ప్రశ్నించాలి. ఇందులో పార్టీ ప్రమేయం అవసరం లేదు. ప్రతి పక్షం నిద్ర లేచి అసెంబ్లీ కి వెళ్ళాలి. పోరాడాలి

Comments are closed.