‘వైస్రాయి సిద్ధాంతం’ అనేది చంద్రబాబునాయుడు ముద్ర వేసిన ఒక రాజకీయ వ్యూహం. ఈ సిద్ధాంతం యొక్క స్వరూపం ఏమిటంటే— “మన శిబిరంలో బలం తక్కువగానే ఉంటుంది. కానీ, ఆ బలం గురించి స్పష్టత ఇవ్వకుండా, అందరూ మన వైపు వస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ, కొంత ఊగిసలాటలో ఉన్నవారిని ఎమోషనల్ ఒత్తిడికి గురిచేసి, వారందరినీ తమ శిబిరంలో కలిపేసుకోవడం. అలా, మొదట ఏమీలేని బలాన్ని, అవసరమైన మెజారిటీ స్థాయికి పెంచుకోవడం.”
ఇలాంటి వ్యూహాన్నే ఎన్టీఆర్ నుంచి టీడీఎల్పీని హస్తగతం చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు తానుగానే కనుగొన్నారు. దశాబ్దాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఇదే పద్ధతిని అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు కూడా మునిసిపాలిటీలను దక్కించుకోవడానికే ‘వైస్రాయి సిద్ధాంతం’తో కుటిల రాజకీయాలు నడుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంపై పూర్తి అధికారం తమ చేతిలో ఉన్నా, మునిసిపాలిటీలను కూడా ఏదో ఒక అడ్డదారిలో దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా అనేక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సభ్యులను తమ పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల అనేక వైస్ ఛైర్మన్, ఛైర్మన్ ఉప ఎన్నికలను ఈ విధానంతోనే సాధించారు.
తాజాగా కాకినాడ జిల్లా తుని మునిసిపాలిటీ విషయంలో కూడా ఇలాంటి రాజకీయమే నడుస్తోంది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అచ్చంగా ‘వైస్రాయి సిద్ధాంతాన్ని’ అనుసరిస్తూ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
తుని మునిసిపాలిటీలో మొత్తం 30 వార్డులున్నాయి. గత ఎన్నికల్లో అన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గెలిచిన వారిలో ఒకరు మరణించడంతో ప్రస్తుతం 29 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ మునిసిపాలిటీలో తెలుగుదేశం పార్టీ బలం అసలు లేదు. కానీ, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రకరకాల వ్యూహాలను అనుసరించి, మొదటి విడతలో నలుగురు కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుంది. అప్పటి నుంచీ “ఇంకా అందరూ టచ్‌లోనే ఉన్నారు” అనే ప్రచారం చేస్తూ, మరికొందరిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు.
తాజాగా, మరో ఆరుగురు కౌన్సిలర్లు యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఇప్పటివరకు పదిమంది తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. అయినప్పటికీ, మునిసిపాలిటీలో మెజారిటీ లేదు.
ఇప్పుడు వైసీపీ తరఫున ఉన్న 19 మందిలో కనీసం ఐదుగురిని ఇదే ‘వైస్రాయి సిద్ధాంతం’ ద్వారా లోబరచుకుని, తుని మునిసిపాలిటీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మరి ఎప్పటికి విజయం సాధిస్తారో చూడాలి!
మొన్నే ఎనుమల రామకృష్ణుడు అలిగాడు…govtలో పవన్ లోకేష్ డామినేట్ చేస్తున్నారు.. తనకి 11 పైసల్ విలువ కూడా ఇవ్వడం లేదు.
బాబుపై గుర్రుగా ఉన్నాడు అన్నావ్..
నీ గ్యాస్ కి consistancy లేదురా వెంకీ..
రీడర్ షిప్ పెరగాలంటే, విశ్వసనీయత పెంచుకో
గత ఎన్నికలలొ అన్ని ముసిపాలిటీలు Y.-.C.-.P ఎలా గెలుచుకుందొ అందరికీ తెలిసిందె!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు,
Case lu petti ina tdp lo kalupukuntaru. Full majarty vunna 23 mla lanu konnaru. Vote ki note case lo oka vote koni dorikipoyaru.