సినిమా ప్రమోషన్ కోసం, సినిమా బాగా ఆడుతోంది అని చెప్పడం కోసం, హీరోలతో మొహమాటం కోసం నిర్మాతలు, పీఆర్ టీమ్ లు, రకరకాల పోస్టర్లు వేస్తాయి. సక్సెస్ మీట్ లు నిర్వహిస్తాయి. డబ్బా స్పీచ్ లు మామూలే. నిర్మాణ యూనిట్ కావాలని సినిమా ప్రమోషన్ కోసం చేసే ఈ వ్యవహారం దర్శకుల నెత్తిన కొమ్ములు మొలిపిస్తోంది.
నిజంగానే తాము సూపర్ సినిమా తీసామని, అద్భుతమైన హిట్ కొట్టేసామని భ్రమల్లోకి వెళ్లిపోతున్నారు. తరువాత సినిమాలకు వాళ్ల డిమాండ్ లు మామూలుగా వుండడం లేదు. కానీ అసలు లెక్కలు నిర్మాతలకు తెలుసు. సినిమా బ్రేక్ ఈవెన్ అయిందా లేదా? ఓవర్ బడ్జెట్ అయిందా? అసలు అన్ని ఏరియాల బయ్యర్లు బయటపడ్డారా లేదా? వెనక్కు ఇచ్చుకోవాల్సింది ఏమేరకు? ఇవన్నీ దర్శకులకు పట్టవు. ట్వీట్ లు చూపించి, పోస్టర్లు చూపించి బుకాయించడం తప్ప.
ఇదేమీ ఈ రోజు, నిన్న, మొన్నటి వ్యవహారం కాదు. రెండు మూడేళ్లుగా సాగుతోంది. ఇప్పుడు మరీ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా యంగ్ డైరక్టర్లు భ్రమల్లోకి వెళ్లిపోతున్నారు. ఓ భారీ సినిమా చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ కాలేదు. నిర్మాతకు అంతంతమాత్రం మిగిలింది. జీఎస్టీలు వెనక్కు ఇవ్వాలి. ఎంతో కొంత వెనక్కు సర్దుబాటు చేయాలి. కానీ దర్శకుడు మాత్రం మన సినిమా సూపర్ హిట్ కదా తనకేమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇంకో సినిమాకు వచ్చిన దానికి కనీసం పాతిక శాతం కలిపేసి పోస్టర్లు వేసారు. మరో సినిమాకు ముందే ఇంత పోస్టర్ పడాలి అని ఫిక్స్ అయిపోయి, డే వన్ నుంచే పదిశాతం, పదిహేను శాతం కలుపుకుంటూ వెళ్లిపోయారు.
ఇటీవలే వెస్ట్ గోదావరి బయ్యర్ ఈ పోస్టర్లు, ఫేక్ కలెక్షన్ల గురించి ఓపెన్ గా గొంతు విప్పారు. కానీ నిర్మాతలు మాత్రం దర్శకులు తమకు సాధించి పెట్టింది ఇది మాత్రమే. ఇంతే.. అసలు లేదు అని ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు. వాళ్ల వెనుక బండ బూతులు తిడతారు. వాళ్లు ముందు మాత్రం వేరుగా వుంటారు.
దీంతో దర్శకులు తమ రెమ్యూనిరేషన్లు మూడు కోట్లు.. అయిదు కోట్లు.. పది కోట్లు.. పన్నెండు కోట్లు.. పద్నాలుగు కోట్లు అంటూ సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతున్నారు. పోస్టర్లు వేసిన నిర్మాతలు తమ పోస్టర్లు తమకే అంటుకుంటూ వుంటే తెల్ల మొహం వేయాల్సి వస్తోంది.
Super
Full of mafiya every where
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Neelanti GA gallavalle ee daridram. Anni ala kevu murty. Ycp ni gajji la pattukuni bratikipotunnav.