తమిళ సూపర్ స్టార్ సూర్య తెలుగులో ఎప్పుడు మంచి సినిమా చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు టైమ్ వచ్చింది. సర్, లక్కీ భాస్కర్ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన వెంకీ అట్లూరి కి ఒకె చెప్పారు. ఏ గెటప్ లు, సందేశాలు ఏమీ లేకుండా చక్కటి లవ్ స్టోరీని నెరేట్ చేసారు. ఆ సినిమా మే నుంచి తెరకెక్కుతుంది. సితార నాగవంశీ నిర్మాత.
ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఆమే హీరోయిన్ కావడానికి ఎక్కువ చాన్స్ వుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రామ్ సరసన సినిమాలు చేస్తోంది.
ఆమె తొలి సినిమా మిస్టర్ బచ్చన్ అరివీర భయంకర డిజాస్టర్ అయింది. అలాంటి దారుణ ఫ్లాప్ ఈ మధ్య కాలంలో లేదు. కానీ భాగ్యశ్రీ అంటే టాలీవుడ్ మాత్రం బాగా ఇష్టపడుతోంది. చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి.
ఇప్పుడు సూర్య సరసన చాన్స్ వచ్చింది. అంటే మూడు మంచి సినిమాలు, విజయ్ దేవరకొండ, రామ్ తో అంటే మంచి సినిమాలే. సూర్య మూడో సినిమా. ఇక ఈ లైనప్ ఇంకా ముందుకు వెళ్లేలా వుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Wow waiting
Ye