మళ్లీ ల్యాండ్ అయిన మహేష్ హీరోయిన్

సినిమాపై హైప్ పెంచేందుకు కావాలనే రాజమౌళి ఇలా చేస్తున్నాడని చెబుతున్నారు.

రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్నారు. అధికారికంగా ఏదీ బయటకు రానప్పటికీ, షూటింగ్ మాత్రం నడుస్తోంది. కాకపోతే అది ప్రత్యేక శిక్షణలో భాగమా లేక సన్నాహకమా లేక నిజంగానే షూట్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.

ఈ సంగతి అటుంచితే, సినిమా ప్రక్రియ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రియాంక చోప్రా గ్యాప్ తీసుకుంది. తన సోదరుడి పెళ్లి కోసం షూటింగ్ కు విరామం ఇచ్చింది. అలా కొన్ని రోజుల పాటు సోదరుడి పెళ్లిలో ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ, తిరిగి ఈరోజు హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. రేపట్నుంచి మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

ఈ సినిమా పూర్తిస్థాయి షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెల నుంచి మొదలవుతుంది. అది కూడా కెన్యాలో. ఆ దేశంలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ పూర్తయిన వెంటనే యూనిట్ కెన్యా వెళ్తుంది.

సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాడు రాజమౌళి. హీరోహీరోయిన్లతో సహా ఎవ్వరూ లొకేషన్ లో మొబైల్స్ వాడకుండా నిషేధం విధించాడు. ఓ హాలీవుడ్ సంస్థతో ఒప్పందం ఇంకా కొలిక్కి రాకపోవడంతో అధికారికంగా ఏదీ ప్రకటించడం లేదని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం సినిమాపై హైప్ పెంచేందుకు కావాలనే రాజమౌళి ఇలా చేస్తున్నాడని చెబుతున్నారు.

5 Replies to “మళ్లీ ల్యాండ్ అయిన మహేష్ హీరోయిన్”

Comments are closed.