‘రెడ్ బుక్’

ఇదే తరహాలో జగన్ లో మరింత ప్రతీకార కాంక్ష రగిలేలాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తూ పోతే.. పెట్టుబడులు ఆశించినంతగా రావు.

అధికారంలోకి రావడం అంటే.. రాష్ట్రాన్ని పాలించడం.. ప్రజలను ఉద్ధరించడం మాత్రమే కాదు! శతృశేషం లేకుండా ప్రత్యర్ధులను నిర్జించడం కూడా! నారా లోకేష్ కర్తగా పురుడు పోసుకుంటున్న నయా సంస్కృతి ఇది! వర్తమాన రాజకీయ సిద్ధాంతంగా స్థిరపడుతున్న ఈ పోకడ మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘రెడ్ బుక్‘!

పాలకులుగా అధికారంలోకి వచ్చే వారికి తొలి లక్ష్యాలు ఏవై ఉంటాయి? ఎన్నికల మేనిఫెస్టోల్లో వారు ప్రకటించే విధంగా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తించడమా? రాష్ట్రంలోని పేదలందరి జీవితాలను సమూలంగా ఉద్ధరించేయడమా? లేదా, అధికారం దక్కింది గనుక.. దొరకగల అన్ని దారులను అన్వేషించి తమ తమ సొంత బొక్కసాలను అడ్డదారుల్లో నింపుకోవడమా? ఏది వారి మొదటిలక్ష్యం?

సాధారణంగా ఏ పార్టీ కొలువు తీరినా సరే.. వారి ప్రాథమిక లక్ష్యం పైన చెప్పుకున్నవేవీ కాదు. మరింకేమై ఉంటుందో తెలుసా? ‘మరొక్కసారి అధికారంలోకి రావడం’! అవును– వారు చేసే ప్రతి ప్రయత్నమూ ‘మళ్లీ అధికారంలోకి రావడం’ అనే లక్ష్యం కోసమే సాగుతూ ఉంటుంది. పైన చెప్పుకున్నవి అన్నీ కూడా.. ఆ లక్ష్యాన్ని చేరుకునే వేర్వేరు మార్గాలు మాత్రమే. ఆ మార్గాలకు ఇప్పుడు కొత్త దారులు కూడా తోడవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను నిర్మూలించడం అలాంటి వాటిలో ఒకటి!

‘ప్రత్యర్థి నిర్మూలన’ పలువిధములు..

ఏ ఒక్క పార్టీని కూడా ఈ విషయంలో ఉపేక్షించవలసిన అవసరం లేదు. ఆధునిక రాజకీయంలో అది అందరికీ ఒక మౌలిక అవసరం అయిపోయింది. ఏ ఒక్కరూ తక్కువ తినడం లేదు. పైగా ఇలాంటి దుర్మార్గమైన పోకడ ఏదో ఇటీవలి కాలంలో.. అనగా ఒకటిరెండు దశాబ్దాల నుంచి మాత్రమే పుట్టిన వ్యవహారం కూడా కాదు. అంతకు ముందునుంచే ఉన్నది!

ఇదివరకటి కాలంలో.. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు ప్రారంభించేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కూడా. ప్రత్యర్థి పార్టీ వారి వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యవహారాల మీద దృష్టి సారించే వారు. నిబంధనల కొరడాలు ఝుళిపించేవారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా.. ఆయా పార్టీలను కుదేలైపోయేలా చేసేవారు. ఇలాంటి పోకడలు పెచ్చుమీరుతూ వచ్చిన తరుణంలో.. నాయకులు కూడా జాగ్రత్త పడడం ప్రారంభించారు. రాజకీయం సొంత రాష్ట్రంలో ఉంటుంది.. వ్యాపారాలు, వ్యవహారాలు, ఆర్థిక వనరులు అన్నీ పొరుగు రాష్ట్రాల్లో మెయింటైన్ చేసేవారు.

ఇదివారికి కొంతలో కొంత ఉపశమనంగా ఉండేది. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ వారిని ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలనుకున్నప్పటికీ కూడా.. పెద్ద వెసులుబాటు చిక్కేది కాదు. కానీ తర్వాతి రోజుల్లో ఈ ‘ప్రత్యర్థి నిర్మూలన’ అనే ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతూ వచ్చింది. కేరక్టర్ అసాసినేషన్ అనేది ఒక మార్గంగా మారింది. దాని తరువాత వచ్చిన ఆధునిక పోకడలు.. అసలు ‘ప్రత్యర్థి పార్టీల నాయకులనే లేకుండా చేయడం’! హత్యలు కాదు.. ఇక్కడ నేతలు ఎంచుకుంటున్నది..!

రాజకీయ హననాలు- తమ రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటున్న వారిని ఏకంగా రాజకీయాల్లో మనజాలని పరిస్థితులు క్రియేట్ చేయడం నిత్యకృత్యం అవుతోంది. అనివార్యంగా రాజకీయాల్లో మాత్రమే కొనసాగాలని అనుకుంటున్న వారిని.. లోబరచుకుని ప్రత్యర్థి పార్టీలో కాకుండా.. తమ పార్టీలోకి వచ్చేలా చేసుకోవడం. ప్రత్యర్థి నిర్మూలన– అనేది కొత్త పుంతలు తొక్కి అసలు ప్రత్యర్థి పార్టీలే ఖాళీ చేయడానికి, ప్రత్యర్థి నాయకులను రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయడానికి శతధా కొత్త మార్గాలు ఆవిష్కృతం అవుతున్నాయి.

వైసీపీ మినహాయింపు కాదు!

రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించే విషయంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహాయింపు ఎంతమాత్రమూ కాదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది. జగన్ ఇటీవల తన కార్యకర్తల సమావేశంలో చెప్పుకున్నట్టుగా.. 2.0 పాలన అనేది ఎప్పటికి వస్తుందో ఏమో తెలియదు గానీ.. అధికార బదలాయింపు జరిగిన ప్రతి సందర్భంలోనూ.. అదివరకటి ప్రభుత్వాలు అనుసరించిన దుర్మార్గపు విధానాలు మాత్రం ఖచ్చితంగా నెక్ట్స్ వెర్షన్ లోకి అప్ గ్రేడ్ అవుతూ ఉంటాయి.

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ– ఎమ్మెల్యేలను ఫిరాయింపజేయడం ఒక్కటే ప్రత్యర్థి నిర్మూలనకు మార్గంగా భావించింది. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వైసీపీని ఖాళీ చేయిస్తే.. ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని భ్రమపడింది. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేర్చుకున్నారు. వారికి మంత్రి పదవుల వైభవాన్ని కూడా కట్టబెట్టారు. దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఒకరైన నారా చంద్రబాబునాయుడుకు.. ఈ రంగంలో నైతిక విలువలు అనే పదానికి అర్థం లేదనే సత్యం చాలా బాగా తెలుసు. అందుకే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 23 మందిని రకరకాల మార్గాల్లో సునాయాసంగా లోబరచుకోగలిగారు.

కానీ చాలా సందర్భాల్లో జరిగినట్టే ఆయన అంచనాలు దారుణంగా తిరగబడ్డాయి. ఆ తర్వాతి ఎన్నికలు వచ్చేసరికి వైఎస్సార్ సీపీ నీరసపడలేదు సరికదా.. 151 స్థానాలతో అనూహ్యంగా పుంజుకుంది. యాదృచ్ఛికంగా ఎంతమందిని చంద్రబాబు అనైతకంగా తమ జట్టులో కలుపుకున్నారో అదే 23 స్థానాలు ఆ పార్టీ మొత్తానికి కలిపి మిగిలాయి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. చాలా తెలివిగా వ్యవహరించారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తమలో కలుపుకోవడం– అనే దుర్నీతిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన గుర్తించారు. అలాగని మడికట్టుకు కూర్చోలేదు. వీలైన చోట్ల కొందరిని, పార్టీ కండువా కప్పి తమలో కలుపుకోకపోయినా.. తెలుగుదేశానికి, జనసేనకు దూరం చేశారు. కానీ.. ప్రత్యర్థి నిర్మూలనకు ఆయన ఎంచుకున్న మార్గం వేరు. ప్రత్యర్థి పార్టీ నాయకులను ఆయన అనేక పద్ధతుల్లో వేధించారు. ఆర్థిక మూలాలను దెబ్బతీసే ముసలి టెక్నిక్కులను కూడా ప్రయోగించారు. కొత్తగా వారి మీద రకరకాల కేసులు బనాయించి.. జైళ్లలో కూర్చోబెట్టడం ఒక మార్గంగా ఆయన భావించారు.

నారా చంద్రబాబునాయుడు మొదలుగా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పఠాభి వంటి వారందరూ ఈ జాబితాలో ఉన్నారు. తన సొంత పార్టీ ముద్ర కిందనే ఉన్నప్పటికీ.. పక్కలో బల్లెంలా మారిన రఘురామక్రిష్ణ రాజును కూడా ఆయన విడిచిపెట్టలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన వేధింపులన్నీ ‘లైటర్ వీన్’ లో సాగిపోయాయి అనుకోవాలి. ఎందుకంటే.. ఒకసారి అరెస్టు, వేధింపులను, హింసను తలపించేలా పోలీసు ట్రీట్మెంట్, జైల్లో కూర్చోబెట్టడం వరకు అనుకున్నట్టే చేశారు. కానీ ఒకసారి వారికి బెయిలు వచ్చిన తర్వాత.. కేసులను ముందుకు తీసుకువెళ్లడంలో అదే దూకుడు కొనసాగలేదు. ఒకసారి తాను వారిని జైల్లో కూర్చోబెట్టడంతోనే.. ఆయన ఈగో చల్లారినట్టుగా ప్రవర్తించారు. చంద్రబాబు మార్కు ప్రత్యర్థి నిర్మూలన పర్వానికి జగన్మోహన్ రెడ్డి ముద్ర గల 2.0 వెర్షన్ ఎలా ఉంటుందో ఆయన చూపించారు.

జగన్ ఊహకు అందని రీతిలో రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రత్యర్థుల నిర్మూలను 3.0 వెర్షన్ ఎలా ఉంటుందో చంద్రబాబునాయుడు ఇప్పుడు రుచిచూపిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను బయటకు రప్పించారు. ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు, తాయిలాలు లేకుండానే అవన్నీ జరుగుతాయని అనుకోలేం. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారిలో రకరకాల సమీకరణాల రీత్యా తమకు ఉపయోగపడతారని అనుకున్న కొందరికి మాత్రం తమ కూటమి పార్టీల్లోకి ఎంట్రీ ఇచ్చి వేర్వేరు అవకాశాలు కల్పించారు. కొంతమందిని అలా గాలికి వదిలేశారు. ఆ ఒక్క మార్గం మాత్రమే కాదు.. జగన్ చూపించిన కేసుల మార్గాన్ని కూడా మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిజంగానే ఆయన జగన్ మార్గానికి నెక్ట్స్ వెర్షన్ రుచిచూపిస్తున్నారు.

జగన్ ప్రభుత్వ కాలంలో తెలుగుదేశం నేతలందరి మీద పెట్టిన కేసులు దాదాపుగా ప్రభుత్వం తరఫునే నమోదు అయ్యాయి. అదివరకు వారు పాల్పడిన అవినీతి పేరుతో ఆ కేసులు పెట్టారు. ఆ కలర్ కూడా.. ప్రభుత్వమే వేధించడానికి పూనుకుంటున్నట్టుగా ప్రజలకు కనిపించింది. చంద్రబాబు మీద ప్రజల్లో ఏర్పడిన సానుభూతి కూడా ఇలాంటి దాని వల్లనే. జగన్మోహన్ రెడ్డి మరీ ఘోరంగా కేవలం 11 సీట్లకు పరిమితమైన పార్టీ నాయకుడిగా మిగిలిపోవడానికి దారి తీసిన కారణాల్లో ప్రజల్లో ఈ అభిప్రాయం ఏర్పడడం కూడా ఒకటని చెప్పాలి. చంద్రబాబునాయుడు ఆ విషయం గ్రహించారు గనుక.. తన రూటు మార్చారు. ప్రభుత్వమే వేధించినట్టుగా కనిపించకుండా ఇతర కేసుల్లో ప్రత్యర్థులు ఇరుక్కుంటున్నారు.

చంద్రబాబు తొలి దశలో ఫిరాయింపుల మార్గాన్ని అనుసరిస్తే.. జగన్ దాన్ని పట్టించుకోకుండా ఇంకోదారికి వెళ్లారు. జగన్ తన పాలనలో ప్రభుత్వం తరఫునే కేసులు నడిపితే.. చంద్రబాబు దానిని పట్టించుకోకుండా ఇంకో దారిలో వెళుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పాఠాలు నేర్చుకుంటూ ప్రత్యర్థి నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నారు.

జాగ్రత్తగా గమనిస్తే ఈ సంగతి మనకు బోధపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిమీద దాడి కేసుల్లో కీలక అరెస్టులు నందిగం సురేష్ మాత్రమే. కానీ ఆయన దానితో నిమిత్తం లేకుండా.. హత్యకేసులోనే ఎక్కువ కాలం జైల్లో గడిపారు. ఆ కేసుల్లో చెప్పుకోదగ్గ అరెస్టులు జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కేసు సజీవంగా ఉండగా.. కిడ్నాపు, ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసుల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. ఎంత లోతుగా వెంటాడుతున్నారంటే.. వల్లభనేని వంశీ విషయంలో కేసు విత్’డ్రా చేసుకున్న సత్యవర్ధన్ పై ఇంకో కేసు పెట్టారు. కేసు ఎందుకు విత్’డ్రా చేసుకున్నారని విచారణ చేస్తున్నారు. ఇక్కడ వంశీ లేదా మరొకరు..వ్యక్తులతో సంబంధంలేదు. న్యాయపరమైన అంశాలను ప్రభుత్వాలు ఎలా తమ పరిధిలోకి తెచ్చుకుంటున్నాయన్నదే చర్చ!

నిజానికి తెలుగుదేశం పార్టీ కక్షకట్టే ‘డొమైన్’ లో ఉండవలసిన నాయకులు వైసీపీలో చాలా మందే ఉన్నారు. ముందుముందు చాలా అరెస్టులు జరగవలసి ఉంది. కానీ వల్లభనేని వంశీనే ఎందుకు ముందుగా జైలుకు వెళ్లారు? రాష్ట్రంలో పసిపిల్లలు కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఊహించగలరు!

నారా లోకేష్ వారి సృష్టి ‘రెడ్ బుక్’!

ప్రజాస్వామ్యం ముసుగులో సాగుతున్న ఈ తరహా ప్రత్యర్థి నిర్మూలన రాజకీయాలకు, రాష్ట్రానికి కాబోయే భావి ముఖ్యమంత్రిగా చెలామణీ అవుతున్న నారా లోకేష్ కొత్త చేర్పు ‘రెడ్ బుక్’! ఒక న్యూటన్ థియరీ, పైథాగరస్ థియరీ, ఐన్ స్టీన్ థియరీల్లాగా.. లోకేష్ థియరీ ‘రెడ్ బుక్’!! తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తమకు కిట్టని వారిని, తమను మాటలు అంటున్నవారిని, తమను ఇబ్బంది పెడుతున్న వారినందరినీ జాబితా రాసి పెట్టుకోవడం.. తమకు అధికారం దక్కిన వెంటనే అదనుచూసి.. వారందరి భరతం పట్టడం ఈ నయా సిద్ధాంతం అన్నమాట.

‘రెడ్ బుక్’ పదాన్ని నారా లోకేష్.. పాదయాత్ర సమయంలో చాలా విస్తృతంగా వాడారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నడిచిన అధికార, పోలీసు యంత్రాంగం.. నిబంధనల నెపం చూపి, ఆయన పాదయాత్రకు చిన్నచిన్న అవాంతరాలు కలిగించిన నేపథ్యంలో ఆయన అందరి పేర్లు తన రెడ్ బుక్ లో రాస్తున్నానని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి అంతు తేలుస్తామని రకరకాలుగా హెచ్చరించారు. ఆ సమయంలో ఆయన టార్గెట్ చేస్తున్నది అధికారుల్లోని జగన్ భక్తులను మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ.. అధికార– రాజకీయ వ్యత్యాసాలు లేకుండా.. తమకు కిట్టని వారినందరినీ రెడ్ బుక్ కింద బుక్ చేసేస్తూ వచ్చారని.. ఇప్పుడిప్పుడే ఆ రెడ్ బుక్ యొక్క విశ్వరూపం బయటపెడుతున్నారని అర్థమవుతోంది.

నారా లోకేష్ శ్రీకారం దిద్దిన ఈ నయా సంస్కృతి ఇక్కడితో ఆగలేదు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి వారు తాము పింక్ బుక్ లో రికార్డు చేస్తున్నాం అంటున్నారు. అలాగే.. మరొకరు బ్లూ బుక్ లో నమోదు చేస్తున్నాం అంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జడలు విప్పుకున్న ఈ జాడ్యం.. ముందు ముందు ఇతర రాష్ట్రాల్లోకి కొత్త కొత్త రంగుల బుక్ ల రూపాల్లోకి పరావర్తనం చెందే ప్రమాదం ఉంది. విషసంస్కృతి దేశవ్యాప్తం అవుతుంది.

ఎటుసాగబోతుందీ ప్రస్థానం?

ఒకరి తర్వాత ఒకరు వేధింపుల్లో నెక్ట్స్ వెర్షన్ లను కనుగొంటూ ముందుకు వెళ్తోంటే.. ఈ ప్రస్థానం ఎక్కడి వరకు సాగుతుంది? రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకువెళుతుంది? రాజకీయాల్లో ఉన్నవారు ముఠా నాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే.. రాష్ట్రానికి చేటు జరుగుతుంది కదా? అనేది ఆలోచన పరుల వేదన.

అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల పరిమాణాన్ని గమనిస్తే.. ఆయనకు ఓటమి దక్కుతుందని ఎవ్వరూ అనుకోరు! ఆయన కూడా అనుకోలేదు. అలాగే చంద్రబాబునాయుడు తన ఫోకస్ మొత్తం పెట్టి అమరావతిని ఒక దశకు తీసుకువచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రజానీకం మొత్తం మురిసిపోయి.. ఆయనకు మరోసారి కిరీటధారణ చేయాలనే గ్యారంటీ కూడా లేదు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో.. ఎన్నికల సమయానికి వారిని నడిపించే, ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఊహామాత్రంగా ప్రస్తావించుకోవడం కూడా కష్టం.

2029 నాటికి జగన్ చేతికే అధికారం వస్తే ఆయన రాజకీయ వేధింపులను, ప్రత్యర్థి నిర్మూలన యజ్ఞాన్ని 4.0 వెర్షన్ కు తీసుకువెళ్లవచ్చు. మూడు వెర్షన్లలోని మార్గాలు కాకుండా.. అచ్చంగా.. తన వేధింపులకు కొత్త మార్గాలు చూడవచ్చు. అలాంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో స్థిరమైన సానుకూల వాతావరణం ఉంటుందని నమ్మి.. పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయి? నాయకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకునే క్రమంలో.. ఉరుమురిమి మంగలం మీద పడినట్టుగా తమ మీద పడరనే భరోసా వారికి ఎలా దక్కుతుంది? జగన్ మళ్లీ గెలవడని గ్యారంటీ ఇస్తే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాం అని పలువురు చెబుతున్నట్టుగా నారా చంద్రబాబు, నారా లోకేష్ పదేపదే చెబుతున్నారు. జగన్ ను ఒక బూచిగా చూపిస్తే ప్రజలు ఎప్పటికీ గెలిపించరేమో అని ఆశపడుతున్నారు. కానీ ముందే చెప్పుకున్నట్టు.. ఇలాంటి మాయోపాయాలు ఎన్నికల వేళదాకా ప్రజలను మభ్యపెట్టగలవని అనుకోలేం.

కానీ.. ఇదే తరహాలో జగన్ లో మరింత ప్రతీకార కాంక్ష రగిలేలాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తూ పోతే.. పెట్టుబడులు ఆశించినంతగా రావు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ బూటకపు పారామీటర్ల గురించి ప్రభుత్వాలు టముకు వేసుకోవచ్చు.. ఆధునిక సాంకేతిక మాయమాటలను వల్లించవచ్చు. కానీ.. వాస్తవంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సస్టయినబుల్ ఫర్ డూయింగ్ బిజినెస్ అనే నమ్మకం పెట్టుబడిదారుల్లో సన్నగిల్లిపోతుంది. రాష్ట్రాన్ని శాసిస్తున్న ఇరు రాజకీయపక్షాలు కలిసి.. రాష్ట్రానికి చేస్తున్న అతిపెద్ద చేటు ఇది.

.. ఎల్. విజయలక్ష్మి

35 Replies to “‘రెడ్ బుక్’”

  1. ఒరేయ్ విజయ లక్ష్మి గా, ఇదే సలహా అప్పుడు వెకిలి వెధవకి ఇవ్వలేదు ఎందుకు?? constitution కలర్ red!! తప్పు chesthe శిక్ష పడుతుంది be careful అని చెప్తుంది!! rights తో పాటు duties kuda ఉంటాయి, క్రైమ్ చేయకుండా ఉండటం నీ duty, cross chesthe శిక్ష ఉంటుంది!! అదే lokesh గారు చెప్పారు, చేస్తున్నారు!! 100% ప్రజల మద్దతు ఉంది!! క్రిమినల్స్ ని punish చేయకూడదు అప్పుడే అభివృద్ధి అంటే ప్రజలకి అలాంటి అభివృద్ధి వద్దనే అంటారు!!

  2. అక్కా.. రెడ్ బుక్ మరీ స్లో గా.. నత్త నడక న నడుస్తోందని.. స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని.. ఒళ్ళు కొవెక్కి బలిసి కొట్టుకుంటున్న వైసీపీ వెధవల జాబితా చాలా పెద్దదిగానే ఉన్నదని.. ఒక ఆర్టికల్ రాయక్కా..

    నీ చిలక పలుకులు ఒకసారి చదవాలని ఉంది..

  3. అక్కా.. రెడ్ బుక్ మరీ స్లో గా.. నత్త నడక న నడుస్తోందని.. స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని.. ఒళ్ళుకొవెక్కి బలిసికొట్టుకుంటున్న వైసీపీ వెధవల జాబితా చాలా పెద్దదిగానే ఉన్నదని.. ఒక ఆర్టికల్ రాయక్కా..

    నీ చిలక పలుకులు ఒకసారి చదవాలని ఉంది..

  4. విజ్జీ పలుకులు మహా ఇంపుగా ఉన్నాయి…

    కానీ అక్కా మేము కూడా కోరుకునేది ఏంటంటే…

    వేధింపులు అనేవి ఏ ప్రభుత్వం లో ఉండకూడదు…

    ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే… ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబ వెధవలు పాలించడం వల్లనే ఈ దుష్పరిణామాలు కలుగుతున్నాయి…

    అలాంటి విపరీత మనస్తత్వం ఉన్న సైకొలను రాజకీయాలకు ఎంత దూరం పెడితే అంత మంచిది…

    అప్పుడు ఈ కక్ష రాజకీయాలు అనేవి ఆటోమేటిక్ గా సమిసి పోతాయి

  5. “ఎర్రి బుక్కు” అన్నారు.. ఎక్కడో మడిచి పెట్టుకోమన్నారు

    ఇప్పుడేంటి RED అనే పదం వినపడ్డా, ఆ కలర్ లో ఏది కనపడ్డా జగ జగ వణుకుతున్నారు??

    ఒక పనిచేద్దామా.. 11 నెంబర్ మాదిరి RED ని కూడా BOYCOTT చెయ్యమని మన paytm కి చేబ్దామా??

    1. రెడ్ బాయికాట్

      యెల్లో బాయికాట్

      11 బాయికాట్

      తల్లి, చెల్లి బాయికాట్

      అమరావతి బాయికాట్

      పోలవరం బాయికాట్

      తెలుగు సినిమా బాయికాట్

      ప్రతిపక్ష హోదా బాయికాట్

      అసెంబ్లీ బాయికాట్

      స్పీకర్ బాయికాట్

      కమ్మ బాయికాట్

      కాపు బాయికాట్

      అభివృద్ధి బాయికాట్

      ..

  6. అయ్యొ! ఇది రెడ్ బూక్ పాలనా?

    మన వంశి TDP ఆఫిస్ మీదా డాడికి పాల్పడితె నొరు మెదపకూడదు, కెసు పెట్టకూడదు అంటవా?

    ఒక వెల కెసు పెట్టిన్నా తన ఇస్టం వచ్చినట్టు కిడ్నాప్ చెసి బెదిరించి సాక్షుల చెత కొర్ట్ లొ చెప్పిస్తుంటే చూస్తూ ఊరుకొవాలి, లెకపొతె రెడ్ బూక్ పాలనా GA?

  7. RRR మీద పొలీసులు 3ర్ద్ డిగ్రీ ప్రయొగిస్తె మాత్రం, కుల్ల బొడిచారు.. అయ్యొ! బాబొ!! అన్న వినలెదు… అంటూ ఎగతాలి చెస్తూ రాసి ఒప్పొంగి పొతుంది GA!!

    .

    అదె మన వంశీ మాత్రం kidnap లు చెసుకొనివ్వకపొతె అది పెద్ద నెరం అంట! redbook పాలన అంట!

  8. అవ్వునా .. నిజ్జమా .. 

    ఇdiచేసినోడు వీధికి పెద్ద.. 

    మరి మీరో ..?

    సిగ్గు శరం గాలికొదులేసి ఇలా నీతులు మాట్లాడటానికి మీ కలం ఎంత సిగ్గు పడుతూ హింస పడిందో.. 

  9. మేడం గారు…అయిదు ఏళ్ళు కుంభకర్ణ నిద్ర తరువాత ఈ మధ్యే మేల్కొన్నట్లు ఉన్నారు…RRR చేసిన టార్చర్ తెలియదు పాపం. 72 ఏళ్ల అయ్యన్నపాత్రుడు మీద అత్యచారం కేస్ కనపడలేదు పాపం. అచ్చెన్నాయుడు, కోళ్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, అదిరేడ్డి అప్పారావు, చంద్రబాబు నాయుడు అరెస్టు అంతా సక్రమం.

  10. RED BOOK లో ఇంకా first పేజీ లోనే ఉన్నాడు.. అప్పుడే చలిజ్వరం తెచ్చుకుని RED బుక్కు.. RED బుక్కు అంటూ హాహాకారాలు చేస్తూ ‘ఉచ్చ పోసుకుని గల్లీ నుండి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నాడు

    .

    .

    కానీ అక్కో

    ఇంకా 11 పేజీ లు ఉన్నాయ్..

    NEXT లండన్ కే

  11. Leave the book aside.. In General in everybody’s life there will be more equal and opposite reaction, when they acquire power and opportunity.

    That’s what is happening now for the worst deeds by Jeggu and his Y Sheep’s.

    See the book, what is written on it??

    Which everybody does..But LOKESH is doing it, by writing down in a book with a TITLE. That’s the only difference.

    (Public గా ప్రజలకి చెప్పి వాళ్ళ ఆమోదం తో చేస్తున్నాడు)

    సినిమాల్లో విలన్ చేసిన అకృత్యాలకి, హీరో వచ్చి వాణ్ని కొట్టాలని, వచ్చి కొడుతుంటే ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో అదే జరుగుతోంది ఇప్పుడు.

    Jeggul will not get power again just for “BUTTON”ing, LOOTING and BULDOZING other party leaders. There is a lot apart from these three. Which he does not know at all.

      1. ఓట్లు వేసి.. 164 సీట్లు ఇచ్చి చెప్పారు..

        వై నాట్ 175 అన్న బోకుగాడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసారు..

      2. అధికారం ఇచ్చారు అంటే ఏమిటి అర్ధం ? మనం ఇంటి ఇంటి కి మంచి చేసేస్తే …అన్ని హామీలు ౯౯% శాతం చేసేస్తే మనకి ఎన్ని సీట్స్ ఇచ్చారు .. ??

  12. RED BOOK లో ఇంకా first పేజీ లోనే ఉన్నాడు.. అప్పుడే చలిజ్వరం తెచ్చుకుని RED బుక్కు.. RED బుక్కు అంటూ ‘గుద్దఎత్తుకుని హాహాకారాలు చేస్తూ.. గల్లీ నుండి ఢిల్లీ చుట్టూ తిరిగి అలసిపోయి బెంగళూరు ప్యాలెస్ లో దాక్కుని ‘EVM భజన చేస్తున్నాడు.

Comments are closed.