టాలీవుడ్‌లో ఒకరు ఒకరికి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పినా అంత సులువుగా నమ్మరు ఎవ్వరూ. ఎందుకంటే ఇక్కడ ఈ బహుమతుల వెనుక చాలా వ్యవహారాలు వుంటాయి. తరువాత చేయబోయే సినిమాకు అడ్వాన్స్ కింద ఇచ్చి గిఫ్ట్ అని చెబుతారు. తామే కొనుక్కుని గిఫ్ట్ అని చెప్పుకుంటారు. బ్లాక్/వైట్, టాక్స్ సమస్యల నేపథ్యంలో గిఫ్ట్ లు అంటారు. కేవలం డౌన్ పేమెంట్ కట్టి, గిఫ్ట్ అనేవి కూడా వుంటాయి. ఇలా చాలా వుంటాయి. చాలా మంది దర్శకులు కార్లు అందుకున్న వైనం వెనుక ఇలాంటివి రకరకాలు వుంటాయి.
సంగీత దర్శకుడు థమన్ కు సీనియర్ హీరో బాలకృష్ణ దాదాపు రెండు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఇండస్ట్రీలో చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. బాలకృష్ణ ఇలా గిఫ్ట్ ఇచ్చారు అనే వార్తను చూసింది చాలా తక్కువ. పైగా తన కెరీర్ ను ఓ మలుపు తిప్పిన దర్శకుడు బోయపాటికి ముందుగా ఇవ్వాలి గిఫ్ట్ కదా అనే కామెంట్ ఒకటి. అఖండ సినిమా లేకపోతే బాలయ్య కెరీర్ మలుపు తిరగేదా అన్న పాయింట్ మరొకటి.
పైగా థమన్ ఫ్రీగా వన్ రుపీ తీసుకోకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి కోసం విజయవాడలో భారీ ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం చేసారు. అందువల్ల దానికి బదులుగా ఈ కారు ఇచ్చారేమో అన్న అనుమానం మరొకటి.
చివరకు ఆరా తీస్తే తెలిసింది ఏమిటంటే, బాలయ్య నిజంగానే కారు గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారు విలువ కోటి డెభై నుంచి కోటి ఎనభై లక్షలు. ఈ మొత్తాన్ని అఖండ 2 నిర్మాతలు 14 రీల్స్ రామ్ ఆచంట, గోపీ ఆచంట చెల్లించారు. బాలయ్య తన రెమ్యూనిరేషన్ లో కట్ చేసుకోమని వారికి చెప్పి, చెల్లింపు ఏర్పాటు చేసారని తెలుస్తోంది. సాధారణంగా రెమ్యూనిరేషన్ ను అంచెలంచెలుగా డ్రా చేసుకుంటారు హీరోలు. ఆ విధంగా బాలయ్య ఓ కారును థమన్ కు గిఫ్ట్ ఇవ్వడం కోసం రెండు కోట్ల వరకు తన రెమ్యూనిరేషన్ నుంచి డ్రా చేసుకున్నారు అనుకోవాలి.
ఈ సినిమాకు బాలయ్య సుమారుగా 35 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్ వుంది. అంతకు ముందు సినిమా డాకూ మహరాజ్ కు 28 కోట్లకు తీసుకున్నారని టాక్ వుంది.
మొత్తం మీద థమన్ ఇటు బాలయ్య అభిమానం అటు బాలయ్య అభిమానుల అభిమానం రెండూ సంపాదించారు. తన పేరే నందమూరి థమన్ అని మారిపోయేలా చేసుకున్నారు. దాని ముందు ఈ కారు ఎంత.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,