రాజకీయం ఒకసారి రుచి మరిగిన తర్వాత వదిలించుకోవడం కష్టమే. ఇకపై రాజకీయాల్లో కొనసాగబోయేది లేదని దాదాపు ఎనిమిది నెలల కిందట ప్రకటించిన ఒక సీనియర్ నాయకుడు.. ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అప్పటిదాకా తాను ఉన్న పార్టీనుంచి బయటకు రావడానికి ఆ మాట అన్నానే తప్ప.. రాజకీయంలో లేకపోతే బతకడం ఎలాగ? అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు.
అధికారం చెలాయిస్తున్న పార్టీలోకి జంప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. రెండు దఫాలు విజయవాడ ఎంపీగా గెలిచి.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేశినేని నాని! ఆయన ప్రస్తుతం బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా వినిపిస్తోంది.
తెలుగుదేశం నాయకుడిగా విజయవాడలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిన నాయకుల్లో కేశినేని నాని ఒకరు. 2019లో రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం కనిపించినప్పటికీ.. విజయవాడలో ఆయన గెలిచారు. అయినా సరే.. తర్వాత తెలుగుదేశం రకరకాల కారణాల వల్ల ఆయనను లూప్ లైన్లో పెట్టింది. అలా ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. బేషరతుగా వైసీపీలో చేరినప్పటికీ.. 2024లో ఆయననే పార్టీ ఎంపీ బరిలోకి దించింది. ఓడిపోయారు. జూన్ 10వ తేదీనే.. ఇక రాజకీయాల్లో కొనసాగబోయేది లేదన్నట్టుగా తన సన్యాసాన్ని ప్రకటించారు.
అయితే తాజాగా కేశినేని నాని మనసు మార్చుకున్నట్టుగా వినిపిస్తోంది. ఆయన వైసీపీని వద్దనుకున్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీలో చేరడానికి దగ్గుబాటి పురందేశ్వరితో పలువిడతలుగా మంతనాలు సాగించి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుత తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల నేపథ్యంలో.. కూటమి పార్టీల మధ్య బెజవాడ రాజకీయాలు ముసలంలాగా మారకుండా ఉండేలా.. కేశినేని నాని బిజెపిలో చేరడం అనే వ్యవహారం స్మూత్ గా సాగుతుందా? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి.
కేశినేని నాని బిజెపిలో చేరినంత మాత్రాన ఆయనకు ఎలాంటి హామీలు ఆ పార్టీ ఇస్తుందనే క్లారిటీ లేదు. విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశించకుండా ఉన్నంతవరకు కూటమి మైత్రీబంధానికి ఆయన చేరిక దెబ్బకొట్టకపోవచ్చు. కానీ.. ఆయన తన పాత స్థానమే కావాలని భీష్మించుకుంటే గనుక తకరారు తప్పదు. ఏది ఏమైనప్పటికీ.. కేశినేని నాని కొన్ని రోజులుగా తన ఆంతరంగిక మిత్రులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాజకీయ పునఃప్రవేశానికి ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రంలో బలోపేతం దిశగా దృష్టి సారిస్తున్న బిజెపి.. కేశినేని నానిని చేర్చుకోవడానికి చాలా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అంటే ఆంధ్ర లో వైసీపీ కన్నా బీజేపీ బెటర్ అనుకొంటున్నారా?
30 ఏళ్ళ అధికారం కన్నా.. 30 సీట్లు లో కూడా పోటీ చేయలేని బీజేపీ కె భవిష్యత్తు ఉందని నమ్ముతున్నారా..!
మేధావి నువ్వే చెప్పాలి .
అయినా చెపినదాంట్లో తప్పు ఏముంది .. మన ఊరువాడా తిరిగి ౩౦ ఏళ్ళు అంటున్న ఎవడు నమ్మడం లేదు కదా ..
Eh party ayina nayakulu vallega manaki origedemundhi ..ycp vallu tdp jsp bjp lo joining inka em labam …anni parties leaders adhikaram kosame maname argue cheskuntam
All the best Nani garu…..
TDP lanti upa prantiya party mimmalni apaledu
కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
చివరికి ఈయన కూడా మిమ్మలని ఛీ కొట్టడా?
సొంతంగా గెలిచే సత్తా ఉన్న నానీకి పార్టీ భలం అవసరమా??
ఒరేయ్ గూట్లే…ఆల్రెడీ నాని , నేను నా మాటకి కట్టుబడి ఉన్న అని ట్వీటాడు…చూసి ఏడువు
Not possible
వన్ ఫైనల్ పాయింట్ – టీడీపీ ఇస్ నష్టం . 11 రెడ్డి కి 2029 లో చాలా లాభం . ఈ న్యూస్ రేపు వస్తుంది.