స్త్రీని ఆకట్టుకోవడం గురించి మగవాళ్లకు కొత్తగా చెప్పేదేమీ లేకపోవచ్చు. సృష్టిలో సహజంగానే ఆపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి ఉంటుంది. ఇష్టం, ప్రేమ, శృంగారేచ్ఛ ఇవన్నీ సహజంగానే చోటు చేసుకుంటాయి. అయితే ఎంత సహజంగా జనించే ఫీలింగ్ అయినా.. ప్రత్యేకించి ఒకరిని ఆకట్టుకోవడం మాత్రం వేరే కథ.
ఒక్కోరి ఆసక్తి ఒక్కోలా ఉంటుంది. ఆపోజిట్ సెక్స్ పట్ల కూడా నిర్ధుష్టమైన అభిప్రాయాలే అమితంగా ప్రభావితం చేస్తాయి. వ్యక్తుల్లోని ఒక్కో క్వాలిటీని ప్రేమించే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఆడవాళ్లను మగాడు అందం అనే దృష్టితోనే ఎక్కువగా చూస్తాడు. అందమే స్త్రీకి గొప్ప క్వాలిటీ అన్నట్టుగా చూసే మగాళ్లే ఎక్కువ, ఆ తర్వాతే వ్యక్తిత్వం గురించి పరిశీలన మొదలవుతుంది.
అదే మగాళ్ల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా అందమే మొదట పరిశీలించే అంశం అయినప్పటికీ, మగాడిని ఆకర్షణీయంగా మార్చే అంశాలు చాలా ఉంటాయి. అతడి వృత్తి, సంపాదన, కుటుంబం.. ఇవన్నీ కూడా మగాడికి తప్పనిసరి అర్హతలు. ఇవన్నీ గాక.. స్త్రీని ఆకట్టుకోవడానికి మగాడు మరిన్ని గుణగణాలను కూడా కలిగి ఉండాల్సి ఉంటుందని అందరికీ తెలిసిందే. మగాడిలో స్త్రీ ప్రత్యేకంగా పరిశీలించే కొన్ని విషయాలు ఉంటాయట. ఇవి స్త్రీని ఆకట్టుకోవడంలో అధికంగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అవేమిటంటే..
స్మెల్లింగ్ గుడ్..
మగాడి నుంచి వెలువడే సువాసనలు స్త్రీని ఆకట్టుకుంటాయని అంటున్నారు పరిశోధకులు. ఈ విషయంలో పెర్ఫ్యూమ్ కంపెనీల వాళ్ల యాడ్స్ ను అంతా గమనించే ఉంటారు. మరీ అంతగాక పోయినా.. సువాసనకు ఆడవాళ్లను ఇంప్రెస్ చేసే శక్తి ఉంటుందట.
ఆత్మవిశ్వాసం..
ఇది ఎవరికైనా ఆభరణమే. అతి విశ్వాసం కాకుండా, ఆత్మవిశ్వాసంతో నడుచుకునే వాళ్లు స్త్రీలను బాగా ఆకట్టుకోగలరని పరిశోధకులు చెబుతున్నారు. పని విషయంలో అయినా, నడవడిక విషయంలో అయినా ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలని సూచిస్తున్నారు.
వంట రావాల్సిందే..
వంట అనేది ఆడవాళ్ల పని అని బలంగా ఫిక్సయిన సమాజం మనది. అయితే వంట వచ్చిన మగాడు ఆడవాళ్లను బాగా ఆకట్టుకుంటాడట. అడపాదడపా అయినా గరిట తిప్పడం మంచి పనే!
సెన్సాఫ్ ఫ్యాషన్..
ష్యాషనబుల్ గా దుస్తులు వేసుకోవడం గురించి ఏ మాత్రం మొహమాటపడనక్కర్లేదు పురుషులు. ఆఫీసుకు అయినా, ఇంటి వద్ద ఉన్నప్పుడు అయినా సందర్భాలకు తగ్గట్టుగా సెన్సాఫ్ ఫ్యాషన్ తో కనిపించడం స్త్రీని ఆకట్టుకునే అంశమే అవుతుంది.
హాబీ ఉండాలి..
మనిషన్నాకా కాస్తంత కళాపోషణ తప్పనిసరి. మగాడు కూడా మనిషే కాబటి.. హాబీస్ ఉండే మగాడు ఆడవాళ్లను అధికంగా ప్రభావితం చేయగలడట. మంచి పుస్తకాలను రెగ్యులర్ గా చదువుతుండటం కూడా మంచి హాబీనే, ఏ గిటారో, పియానో వాయించగలడం కూడా మగాడికి అదనపు అర్హతే అవుతుంది ఆడవాళ్లను ఆకట్టుకోవడం అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్.