సినిమాల్లో కాదు..ట్విట్టర్ లో కామెడీ

కమెడియన్లు సినిమాల్లో కామెడీ పండించాలి. కానీ అలా పండాలి అంటే సరైన పాత్రలను, డైలాగులను రచయితలు అందించాలి. అప్పుడే కమెడియన్ల టైమింగ్ కలిసి, టైమ్ బాగుండి క్లిక్ అవుతుంది. లేదూ అంటే సినిమాలు చేస్తూ…

కమెడియన్లు సినిమాల్లో కామెడీ పండించాలి. కానీ అలా పండాలి అంటే సరైన పాత్రలను, డైలాగులను రచయితలు అందించాలి. అప్పుడే కమెడియన్ల టైమింగ్ కలిసి, టైమ్ బాగుండి క్లిక్ అవుతుంది. లేదూ అంటే సినిమాలు చేస్తూ పోవడమే తప్ప, కామెడీ క్లిక్ కాదు. రాహుల్ రామకృష్ణ మంచి కమెడియన్. కానీ సరైన పాత్రలు ఇంకా రావాల్సి వుంది. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో హిట్ లు వున్నాయి..ఫట్ లు వున్నాయి.

సినిమాల్లో కామెడీ ఇలా ఫిఫ్టీ..ఫిఫ్టీగా వుంది అనేమో, ట్విట్టర్ లో కామెడీ మొదలుపెట్టారు. నిన్నటికి నిన్న తాను 2022 నుంచి ఇక సినిమాలు వదిలేస్తా అంటూ ఓ ట్విట్ వేసారు. దాంతో ఇంకేముంది నెటిజ‌న్లు అంతా పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, సెటైర్లతో వెంట పడ్డారు. మీడియా కూడా ఓ వార్త దొరికింది కదా అని అందుకుంది.

తిరిగి రోజుఅదే రాహుల్ రామకృష్ణ మరో ట్వీట్ వేసాడు. ఇంత మంచి ఙీవితాన్ని, విలాసాలను, డబ్బును, ఇంకా..ఇంకా ఎందుకు వదులుకుంటా…అని అన్నాడు.

అలా అని ఊరుకంటే బాగానే వుండును. దానికి ముందు ఇది జోక్ ఫూల్స్ అని కూడా ఓ మాట జోడించాడు. అంటే రాహుల్ మాటను నమ్మిన జ‌నాలంతా ఆయనకు ఫూల్స్ లా కనిపిస్తున్నారన్న మాట. రాహుల్ రిటైర్ మెంట్ వార్తను క్యారీ చేసిన మీడియా జ‌నాలు కూడా ఫూల్స్ గా కనిపిస్తున్నారన్నమాట.

అవును నిజ‌మే సెలబ్రిటీలను గుడ్డిగా ఫాలో అయ్యే వారంతా ఫూల్స్ నే కదా? వాళ్ల మాటలను, వాళ్ల చేతలను లైట్ తీసుకుని పట్టించుకోకుండా పక్కన పెడితే అప్పుడు తెలుస్తుంది అసలు ఫూల్స్ ఎవరో?