రవితేజ‌ సమస్య ఏమిటి?

ఖిలాడీ సినిమాకు ఇంత వరకు డబ్బింగ్ చెప్పలేదు హీరో రవితేజ‌. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. ఈ సండే, మండేలో చెబుతా అన్నారు అన్నది యూనిట్ వైపు నుంచి వినిపిస్తున్న సమాధానం.…

ఖిలాడీ సినిమాకు ఇంత వరకు డబ్బింగ్ చెప్పలేదు హీరో రవితేజ‌. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. ఈ సండే, మండేలో చెబుతా అన్నారు అన్నది యూనిట్ వైపు నుంచి వినిపిస్తున్న సమాధానం. విడుదల వారం కన్నా లోపులో వుండగా, మండే నాడు సెన్సారు వుండగా, హీరో ఇప్పటి వరకు డబ్బింగ్ చెప్పకపోవడం ఏమిటి? ఇదీ మిలియన్ డాలర్ క్వశ్చను. దీనికి రెండు రకాల లాజికల్ సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఒకటేమిటంటే ఖిలాడీ సినిమాకు రవితేజ‌కు 10 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. మరో మూడు కోట్లు ఇవ్వాల్సి వుందని తెలుస్తోంది. ఖిలాడీ సినిమాకు రవితేజ‌ సినిమాలకు కనీవినీ ఎరుగని విధంగా 60 కోట్లు ఖర్చు చేసారు. ఈ వైనం విని టాలీవుడ్ జ‌నాలు నివ్వెర పోతున్నారు. పైగా కరోనా కారణంగా సినిమాపై వడ్డీల భారం భాగా పడింది. దీని వల్ల మరో మూడు కోట్లు భారం అంటే నిర్మాతకు కచ్చితంగా కష్టమే. ఇక్కడే తకరారు వచ్చి డబ్బింగ్ చెప్పలేదని వార్తలు.

కానీ ఇది అంత నమ్మబుల్ గా లేదు. ఎందుకంటే నిర్మాత కోనేరు సత్యనారాయణ డబ్బుకు వెనుకాడే వ్యక్తి కాదు. అలా లెక్కలు చూసుకుంటే ఖిలాడీ మీద ఆయన అరవై కోట్లు ఖర్చు చేయరు. పైగా సెట్ లో ఓ రోజు కూడా అడుగుపెట్టకుండా ఆయన మొత్తం దర్శకుడి మీదే వదిలేయరు.

ఇక్కడ రెండో సమాధానం కూడా వినిపిస్తోంది. రవితేజ‌కు 11న సినిమా విడుదల చేయడం అంతగా ఇష్టం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రలో రేట్లు లేవు. సెకెండ్ షో లేదు. యాభై శాతం ఆక్యుపెన్సీ. ఇలాంటి టైమ్ లో కలెక్షన్లు ఏ మేరకు కనిపిస్తాయి? కలెక్షన్లు కనిపించకపోతే వాటి ప్రభావం రవితేజ‌ మిగిలిన సినిమాల మార్కెట్ మీద పడుతుంది. రవితేజ‌ రెమ్యూనిరేషన్ ఇప్పుడు భారీగా పెరిగింది. లేటెస్ట్ సినిమాకు 18 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్.

క్రాక్ సినిమా క్రేజ్ వల్ల వచ్చింది ఇదంతా. అంతకు ముందు రవితేజ‌ సినిమాలు అంటే గట్టిగా 30 కోట్ల బిజినెస్ దాటలేదు. ఇప్పుడు ఖిలాడీ హిట్ కావాలి. మంచి అంకెలు కనిపించాలి. లేదూ అంటే మిగిలిన సినిమా లెక్కలు తేడా వస్తాయి.

అందుకే కొన్నాళ్లు విడుదల వెనక్కు నెట్టాలన్నది రవితేజ‌ ఆలోచనగా తెలుస్తోంది. కానీ నిర్మాత, దర్శకులు మాత్రం మళ్లీ మంచి డేట్ దొరకదు. కాంపిటీషన్ లేదు రెండు మూడు వారాల పాటు. అందుకే ఇప్పుడు విడుదల చేయాలని చూస్తున్నారు.

చూడాలి మరి 11న వస్తుందో, ఓ వారం అయినా వెనక్కు ఙరుగుతుందో?