సెబాస్టియన్-రే చీకటి కానిస్టేబుల్

ఏదో ఒక కాన్సెప్ట్ వుంటేనే తప్ప సరైన సిన్మా స్క్రీన్ మీదకు రావడం లేదు. అందులొనూ కొత్తగా కెరీర్ బిగిన్ చేసిన హీరోలకు అయితే ఇలాంటి సినిమాలు మరీ పెర్ ఫెక్ట్ గా వుంటాయి.…

ఏదో ఒక కాన్సెప్ట్ వుంటేనే తప్ప సరైన సిన్మా స్క్రీన్ మీదకు రావడం లేదు. అందులొనూ కొత్తగా కెరీర్ బిగిన్ చేసిన హీరోలకు అయితే ఇలాంటి సినిమాలు మరీ పెర్ ఫెక్ట్ గా వుంటాయి. రాజుగారు..రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ సెబాస్టియన్ పిసి 524. 

ఈ సినిమా టీజ‌ర్ ను విడుదల చేసారు. అది చూడగానే అర్థం అయిపోతోంది. ఇదో కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అని. కిరణ్ ఈ సినిమాలో కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు. కానిస్టేబుల్ కు రేచీకటి వుంటే పరిస్థితి ఏమిటి? ఎలా మేనేజ్ చేసాడు. ఎలా సక్సెస్ అయ్యాడు అన్నది పాయింట్ గా కనిపిస్తోంది. 

'నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్‌) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా!' అని తల్లి చెప్పే మాటతో 'సెబాస్టియన్ పిసి524' టీజర్ మొదలైంది. టీజ‌ర్ ఆద్యంతం ఫన్ బేస్డ్ గా నడిచింది. రేచీకటి గల హీరో నైట్ డ్యూటీ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా ఉంది. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు 'సెబాస్టియన్ పిసి524'లో ప్రధాన పాత్రలు పోషించారు.