బ్రేకప్స్ పై నిఖిల్-సుశాంత్ ఏమంటున్నారంటే..!

నాగచైతన్య-సమంత విడిపోయారు. ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. 50 ఏళ్ల ఓ సీనియర్ హీరో కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇలా ప్రస్తుతం పెటాకుల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై…

నాగచైతన్య-సమంత విడిపోయారు. ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. 50 ఏళ్ల ఓ సీనియర్ హీరో కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇలా ప్రస్తుతం పెటాకుల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై ఇద్దరు హీరోలు స్పందించారు. వాళ్లలో ఒకరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాగా.. మరొకరు తాజాగా పెళ్లయిన వ్యక్తి. వాళ్లే సుశాంత్, నిఖిల్.

ఈమధ్యే పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. ఇలాంటి వ్యక్తిని బ్రేకప్స్ గురించి అడిగితే అతడ్ని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. కానీ నిఖిల్ మాత్రం తడబడలేదు. బ్రేకప్స్ పై కాస్త ఫన్నీగా, ఇంకాస్త సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు.

“బ్రేకప్ పై నా అభిప్రాయం ఏంటని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను. ఎందుకంటే, ఇంట్లో కూర్చొని మా ఆవిడ ఈ ప్రొగ్రామ్ చూస్తోంది. మొన్ననే నాకు పెళ్లయింది, అప్పుడే బ్రేకప్ అంటే కష్టం. నిజానికి నాకు అలాంటి ఉద్దేశాలు కూడా ఏం లేవు. నేను నా వైవాహిక జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాను.”

ఇలా బ్రేకప్స్  పై స్పందించాడు నిఖిల్. జీవితాన్ని ఎంత ప్రేమిస్తామో, భార్యను కూడా అంతగా ప్రేమించాలని అప్పుడిక బ్రేకప్స్ ఉండవని అంటున్నాడు నిఖిల్. ఇక మరో హీరో సుశాంత్ కూడా దీనిపై స్పందించాడు. తన లైఫ్ లో కూడా చిన్న చిన్న బ్రేకప్స్ ఉన్నాయని బయటపడ్డాడు.

“బ్రేకప్ పై స్పందించడానికి నేను కరెక్ట్ పర్సన్ కాదు. ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు. కాలేజ్ టైమ్ నుంచి బ్రేకప్స్ ఉంటాయి. బ్రేకప్స్ అయితే మనిషి బెటర్ గా తయారవుతాడు. ఇక పెళ్లి తర్వాత బ్రేకప్ గురించి నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకింకా పెళ్లి అవ్వలేదు. నా లైఫ్ లో కూడా చిన్న చిన్న బ్రేకప్స్ ఉన్నాయి.”

ఇలా నిఖిల్, సుశాంత్ ఇద్దరూ బ్రేకప్స్ పై తమ అభిప్రాయాల్ని బయటపెట్టారు. సుమంత్ హీరోగా నటించిన 'మళ్లీ మొదలైంది' సినిమా త్వరలోనే ఓటీటీలో డైరక్ట్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సుశాంత్-నిఖిల్ ఇలా బ్రేకప్స్ పై స్పందించారు. విడిపోవడం అనే కాన్సెప్ట్ మీదే ఈ సినిమా తెరకెక్కింది. నిజజీవితంలో ఆల్రెడీ విడాకులిచ్చి, సింగిల్ గా ఉంటున్న సుమంత్ ఇందులో హీరోగా నటించాడు.