కనువిప్పు కలిగించే పీఆర్సీ పచ్చి నిజాలు

ఈ పెరుగుదల చాలదా? ఇంకా సమ్మె చేయాలా? లెక్కలు చూడండి. ప్రభుత్వమేమో తాము జీతాలు పెంచామనీ ఏ ఒక్కరికీ జీతం తగ్గలేదనీ ప్రకటిస్తుంటే ప్రభుత్వోద్యోగుల నాయకులు మాత్రం తమ జీతాలు తగ్గి పోయాయని తమకు…

ఈ పెరుగుదల చాలదా? ఇంకా సమ్మె చేయాలా? లెక్కలు చూడండి. ప్రభుత్వమేమో తాము జీతాలు పెంచామనీ ఏ ఒక్కరికీ జీతం తగ్గలేదనీ ప్రకటిస్తుంటే ప్రభుత్వోద్యోగుల నాయకులు మాత్రం తమ జీతాలు తగ్గి పోయాయని తమకు PRCఅక్కర లేదని కొత్త జీతాల G.O లు ఉపసంహరించుకోమనీ తాము సమ్మె చేస్తామనీ పట్టుబడుతున్నారు .

సామాన్య ప్రజానీకానికి ఎవరు అబధ్ధం చెబుతున్నారో ఎవరు నిజం చెబుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి కల్పించారు. ప్రభుత్వం Salary పెరిగిందని చూపిస్తుంటే అది తమకు ముందునుంచి రావాల్సిన D.A లను 2022 జనవరినుంచి ఇస్తూ ఉండడం వల్లనే ఆ పెరుగుదల కన్పిస్తోందని అది తీసేసి చూస్తే తమ జీతాలలో పెరుగుదల లేదనిపైగా నష్టం వస్తోందనీ అనడం మొదలు పెట్టారు.ఈ రెండు వాదనలలోని నిజా నిజాలు పరీక్షించి చూస్తే తెలుస్తాయి.అవి మీకు అరటి పండు వలిచి పెట్టినట్లు వివరించి చూపిస్తాను.

ఇక్కడ ముందుగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఎక్కడైనా మనం ఎవరికైనా ఇచ్చింది లెక్కించే టప్పుడు ముందుగా అడ్వాన్సుగా ఇచ్చినది తరువాత ఇచ్చినది కలిపి లెక్కచూస్తాం. అలాగే చూడాలి కూడా.అడ్వాన్సుగా ఇచ్చింది మరచి పో అంటే కుదరదు కదా? అందువల్ల PRC వల్ల జీతం ఎంత పెరిగింది అని లెక్క వేసేటప్పుడు డిశంబరు నెల జీతంలో I.R (తాత్కాలిక భృతి) తీసివేసి మీగిలిన దానిని పాత జీతంగా పరిగణించాలి.PRC లేకుంటే I.R ఉండదు కదా?

కొత్త జీతం calculationకి fitment 23 శాతంగా అందరు నాయకులూ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పుకున్న సంగతి మనమందరం ప్రత్యక్షంగా T.V. లో చూసేము. (కేంద్రంలో పదేళ్ళ తర్వాత అమలు చేసిన 7th pay commission లో ఇది కేవలం 14 శాతం మాత్రమేనని ఆ ఉద్యోగులకు ఎటువంటి I.R. ఇవ్వబడలేదని గ్రహించాలి.( ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పానో తర్వాత తెలుస్తుంది)

కొత్త జీతాలు అందుకున్న నాయకులు తమ పే స్లిప్పులను మంటల్లో వేసారే గాని అవి అందరికీ చూపించ లేదు. చూపిస్తే తమకు ఎంత జీతాలొస్తున్నదీ ఎంత పెరిగినదీ అందరికీ తెలిసిపోతుందనే. ఇక్కడ ఫేస్ బుక్ లో మిత్రులు ఒకరిద్దరు తమకు జీతాలు పెరిగాయని తమ అమ్మగారి పెన్షను పెరిగిందనీ పే స్లిప్పులు బేంక్ అకౌంట్లు చూపిస్తూ చెప్పారు. అయినా సరే కొందరు తమకు తమ జీతాలు తగ్గాయంటే నమ్మరేం అంటూ బుకాయిస్తూనే ఉన్నారు. అందుకే నేను నాయకుల పే స్లిప్పులను చూపిస్తే ఎంత పెరిగిందో/ తరిగిందో చూపిస్తానని అన్నాను.ఎవ్వరూ దీనికి స్పందించలేదు.

ఇదిలా ఉండగా ఉద్యోగుల తరఫున వాదిస్తున్న మిత్రుడొకరు ఒక ఉద్యోగి పే స్లిప్పుని చూపిస్తూ జీతం పెరిగింది కాని అది జనవరి 1, 2022 నుండి పాత D.Aలు ఇవ్వడం వల్లనే పెరుగుదల కన్పిస్తొందని లేకపోతే కొద్దిగా నష్టమే వస్తుందని వాదిస్తూ పోస్టు పెట్టాడు. నిజా నిజాలు తేల్చుకుందికి మనకొక పే స్లిప్పు దొరికింది కనుక దానిని విశ్లేషించి నిజా నిజాలు తెలుసుకుందాము. 

ఆ పే స్లిప్పు చూడండి. ఆ ఉద్యోగి నెల జీతంలో స్పష్టంగా  రూ. 6 619  (79321-72702) కన్పిస్తోంది. ఇంకుముందే అడ్వాన్సుగా పొందుతున్నI.R. రూ..10875 తో కలిపితే పెరిగిన మొత్తం నెలకు రూ.17,492.(కొంచెం అర్థం కాని వారు పాతజీతం రూ.72702 లో I.R రూ.10873 తీసేస్తే వచ్చిన పాతజీతం రూ. 61,829 ని కొత్త జీతం 79,321లో తీసేస్తే  నిజంగా పెరిగిన జీతం రూ. 17,492 వస్తుంది.

ఇది వాస్తవంగా ప్రభుత్వం ఈ ఉద్యోగికి పెంచిన జీతం. అయితే పోస్టు పెట్టిన మిత్రుడు 2021 డిశంబరు నెలాఖరుకి ఈ ఉద్యోగికి రావలసిన D.A.లమొత్తం రూ.8054 (20% 40.270) గా లెక్కకట్టాడు. ఈ D.A.ల మొత్తాన్ని కూడా మనం పరిగణన లోకి తీసుకుంటే పెరిగిన జీతం( 17,492 లో 8054 తీసేయగా మిగిలినది)రూ.9,438. అంటే మనం పెంచిన D.A.లను పక్కన పెట్టి చూసినా ఈ ఉద్యోగికి PRC వల్ల కలిగిన ప్రయోజనమే నెలకు ఊ.9,438 గా స్పష్టంగా తేలుతోంది.

అంటే పాత జీతంలో basic రూ,40,270 ఉన్నఉద్యోగికి పెరిగిన పాత D.A.లు కాకుండా నెలకు రూ.9,438, D.A.లతో కలిపి నెలకు 17,492 పెరిగిందన్నమాట.(ఇదే ఆ పే స్లిప్పులో చూపించినది.) ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలి.

నేను చెప్పిన మిత్రుని పోస్టుమీద కామెంటు పెడుతూ ఒకరు కేంద్రం 7th pay commission లో basic+ D.A దాని మీద fitment ఇచ్చారని ఇక్కడలా చేయలేదని తాము నష్టపోయామని వాపోయారు. కేంద్రంలో ఇచ్చిన fitment 14 శాతం మాత్రమే. ఇక్కడ ఇచ్చినది 23 శాతం 9 శాతం ఎక్కువ. అందువలన పోలిక తేవడం అసందర్భం.

మరో ముఖ్యమైన విషయం.ప్రబభుత్వం తమకు 2018, 2019, 2020 లలో ఇవ్వాల్సిన D.A.లు తమ హక్కుని arrears ఇవ్వక పోవడం ఘోరమనీ వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో D.A. ప్రకటించి కూడా తర్వాత కరోనా దృష్ట్యా withdraw చేసేరనీ అదీ దాని తరువాత ఇవ్వాల్సిన 3 D.A.లు 2021 july నుంచి కాని release చేయలేదనీ తెలుసుకోవడం మంచిది. 

జనవరి నుంచి పెంచిన D.A.లను చూపించి తమ జీతాలు పెరిగాయని ప్రభుత్వం అంటోందని పెరగ లేదు సరికదా తరిగాయంటున్న ప్రభుత్వోద్యోగుల మాటల్లో నిజం లేదని తేట తెల్లమయింది. తమ జీతాలెంత పెరిగిందీ ప్రజలకు చెప్పి తమ సమ్మెకు ప్రజలమద్దతు కోరితే  వారికి న్యాయమనిపిస్తే వారే మద్దతిస్తారు.

– గోపాలకృష్ణరావు పంతుల