ప‌దేళ్ల డేటింగ్‌…ఒక‌టిన ప్ర‌ముఖ సింగ‌ర్ పెళ్లి

వాళ్లిద్ద‌రి మ‌ధ్య 12 ఏళ్ల స్నేహం. ఇందులో రెండేళ్ల స్నేహం, ప‌దేళ్ల ప్ర‌ణ‌యం. అంటే  ఏకంగా ప‌దేళ్ల ప్రేమ ప్ర‌యాణం. ఇద్ద‌రి త‌నువులు మాత్ర‌మే వేర్వేరు. మ‌న‌సులు మాత్రం ఒక్క‌టే.  Advertisement ఒక‌రికొక‌రు విడిచి…

వాళ్లిద్ద‌రి మ‌ధ్య 12 ఏళ్ల స్నేహం. ఇందులో రెండేళ్ల స్నేహం, ప‌దేళ్ల ప్ర‌ణ‌యం. అంటే  ఏకంగా ప‌దేళ్ల ప్రేమ ప్ర‌యాణం. ఇద్ద‌రి త‌నువులు మాత్ర‌మే వేర్వేరు. మ‌న‌సులు మాత్రం ఒక్క‌టే. 

ఒక‌రికొక‌రు విడిచి ఉండ‌లేనంత ప్రేమ బంధం. పైగా అత‌ను ప్ర‌ముఖ సింగ‌ర్‌, పాపుల‌ర్ హోస్ట్‌. అత‌నే ఆదిత్య నారాయ‌ణ‌న్‌. త‌న ప్రేయ‌సి శ్వేతా అగ‌ర్వాల్‌ను డిసెంబ‌ర్ 1న పెళ్లాడ‌నున్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో అత‌ను ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు పెళ్లి పీట‌లెక్కిన విష‌యం తెలిసిందే. ఈ వ‌రుస‌లో ఇప్పుడు సింగ‌ర్ ఆదిత్య నారాయ‌ణ‌న్ చేర‌నున్నారు. 

స్నేహితురాలైన శ్వేత అగ‌ర్వాల్‌తో రెండేళ్ల స్నేహం… ప్రేమ‌కు దారి తీసింది. అలా ప‌దేళ్లుగా తామిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్న‌ట్టు ఆదిత్య చెప్పుకొచ్చారు. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో మ‌రో రెండు రోజుల్లో పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

క‌రోనా నేప‌థ్యంలో కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకోనున్న‌ట్టు వెల్ల‌డించారు. పెళ్లికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ఆదిత్య ప్ర‌క‌టించారు. 

శ్వేతాతో క‌లిసి జీవించేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు అత‌ను చెప్పుకొచ్చారు. ప‌ర‌స్ప‌రం క‌లిసి జీవించాల‌నే త‌మ ఇద్ద‌రి కోరిక డిసెంబ‌ర్ ఒక‌టిన నెర‌వేర‌నుంద‌ని ఆదిత్య నారాయ‌ణ‌న్ తెలిపారు. 

ఏ చిన్న అవ‌కాశాన్నీ…వ‌ద‌లి పెట్టవా బాబూ