ఉండ‌వ‌ల్లిపై రామోజీ అక్క‌సు

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌పై ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు అక్క‌సు అలాంటిదిలాంటిది కాదు. చివ‌రికి తాను రాసే నీతి సూత్రాలు, చెప్పే ధ‌ర్మోప‌న్యాసాలకు కూడా సమాధి క‌ట్టేంత అని చెప్ప‌క త‌ప్ప‌దు.…

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌పై ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు అక్క‌సు అలాంటిదిలాంటిది కాదు. చివ‌రికి తాను రాసే నీతి సూత్రాలు, చెప్పే ధ‌ర్మోప‌న్యాసాలకు కూడా సమాధి క‌ట్టేంత అని చెప్ప‌క త‌ప్ప‌దు. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే చాలు …వాటికి త‌న ప‌త్రిక‌లో, చాన‌ల్‌లో రామోజీ ప్రాధాన్యం ఇవ్వ‌డం చూశాం.

కానీ సీఎంపై ఘాటు విమ‌ర్శ‌లు చేసినా , అవి ఈనాడు ప‌త్రిక‌లో ప్ర‌చుర‌ణ‌కు నోచు కోలేదంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఇక్క‌డ జ‌గ‌న్‌పై ప్రేమతో విమ‌ర్శ‌ల‌ను దాచి పెట్టార‌ని ఎవ‌రైనా అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టు. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన స‌ద‌రు రాజ‌కీయ నేత‌పై రామోజీరావుకు ప‌ట్ట‌రాని  కోపం కార‌ణంగానే, అది ఈనాడులో ప్ర‌చుర‌ణ భాగ్యానికి నోచుకోలేద‌ని అర్థం చేసుకోవాలి.

రాజ‌మండ్రిలో నిన్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు.  కేంద్ర పాల‌కుల నియంతృత్వ విధానాల వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని ఉండ‌వ‌ల్లి ధ్వ‌జ‌మెత్తారు. దీని గురించి ప్ర‌శ్నించ‌లేని ప్ర‌భుత్వం ఎందుకని ఆయ‌న నిల‌దీశారు. 

వైసీపీకి 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు, రాజ్య‌స‌భ‌లో ఎక్కువ మంది స‌భ్యులున్నా కేంద్రాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. అలాగే ప్ర‌తిప‌క్షం అంటున్న‌ట్టు , ప్ర‌జ‌లు అనుకుంటున్న‌ట్టు సీబీఐ కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నారా? అని సీఎం జ‌గ‌న్‌ని గ‌ట్టిగా ప్ర‌శ్నించారు.  

ప్ర‌ధానంగా పోల‌వ‌రం ప్రాజెక్టుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఉండ‌వ‌ల్లి ఎండ‌గ‌ట్టారు. ఇదే ఉండ‌వ‌ల్లి ప్రెస్‌మీట్‌కు ఆంధ్ర‌జ్యోతిలో ప్రాధాన్యం ఇస్తూ ఫ‌స్ట్ పేజీలో క్యారీ చేశారు. చివ‌రికి జ‌గ‌న్ ప‌త్రిక సాక్షిలో కూడా ఉండ‌వ‌ల్లి విమ‌ర్శ‌ల‌కు స్థానం క‌ల్పించారు. 

కానీ ఈనాడులో మాత్రం ఉండ‌వ‌ల్లి విమ‌ర్శ‌ల‌కు అస‌లు చోటే ద‌క్క‌లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉండ‌వ‌ల్లి లాంటి మేధావి, విలువ‌లున్న నేతగా గౌర‌వం ఉన్న వ్య‌క్తి మాట్లాడితే, క‌నీసం సింగిల్ కాల‌మ్ వార్త ఇవ్వ‌క‌పోవ‌డం రామోజీ మార్క్ జ‌ర్న‌లిజానికి ప్ర‌తీక‌నా?

త‌మ య‌జ‌మాని రామోజీపై ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ న్యాయ‌పోరాటం చేస్తుండ‌డంతో, ఆయ‌న‌కు సంబంధించిన వార్త‌ను కిల్ చేయ‌డం న్యాయ‌మా? ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్ చైర్మ‌న్‌గా  రామోజీరావు సార‌థ్యం వ‌హిస్తున్న సంస్థ రూ.2300 కోట్ల సొమ్మును ఆర్‌బీఐ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ‌సూలు చేసింది. దీనిపై ఉండ‌వ‌ల్లి కేసు వేశారు.  ప్ర‌స్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో న‌డుస్తోంది.

కేసులో దోషిగా తేలితే, రిజర్వు బ్యాంకు నిబంధనల ప్ర‌కారం రామోజీకి సుప్రీంకోర్టు భారీ జరిమానా విధిస్తుందని గ‌తంలో ఉండవ‌ల్లి తెలిపారు.  అలాగే వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు అంటే సుమారు 7 వేలకోట్లు జ‌రిబ‌మానా  విధించే అవకాశం కూడా ఉంద‌ని అప్ప‌ట్లో ఆయ‌న చెప్పారు.

భారీ జ‌రిమానాతో పాటు  రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష పడే అవ‌కాశాలున్న‌ట్టు లాయ‌ర్ కూడా అయిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కు మార్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అస‌లు 12 ఏళ్ల పాటు కోర్టు మెట్లు ఎక్క‌కుండానే నెట్టుకొచ్చి, హైకోర్టులో కొట్టి వేసిన కేసును తిర‌గ‌తోడిన ఉండ‌వ‌ల్లి పేరు వింటే చాలు రామోజీ జీర్ణించుకోలేర‌నే వాస్త‌వం తాజా ఎపిసోడ్‌తో అంద‌రికీ తెలిసొచ్చింది.

త‌న‌పై న్యాయ‌పోరాటం చేస్తున్న ఉండ‌వ‌ల్లి అక్క‌సు పెంచుకుని, ఆయ‌న‌కు సంబంధించిన వార్తల‌పై త‌న మీడియాలో రామోజీ నిషేధం విధించార‌నేందుకు తాజా ఉదంతమే నిద‌ర్శ‌నం.

అంటే త‌న వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి  భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు నిర్వ‌చ‌నం మారిందా?  నీతుల‌న్నీ ఎదుటి వాళ్ల‌కు చెప్పేందుకేనా? ఆచ‌రించ‌డానికి కాదా?  స‌మాచార హ‌న‌నానికి పాల్ప‌డే స్వేచ్ఛ ఈనాడుకు ఎవ‌రిచ్చారు? ఇంత కంటే సిగ్గుమాలిన చ‌ర్య ఏమైనా ఉంటుందా?

ఏ చిన్న అవ‌కాశాన్నీ…వ‌ద‌లి పెట్టవా బాబూ