ఎన్నాళ్లకు..ఎన్నాళ్లకు..ఓ సినిమా

మార్చి 14 లగాయతు సినిమా విడుదల అన్నది, థియేటర్ల సందడి అన్నది మరిచిపోయారు అంతా. మళ్లీ థియేటర్లు కళకళలాడే సమయం దగ్గరకు వస్తోంది. డిసెంబర్ 4 నుంచి టెనెంట్ సినిమాతో కొన్ని థియేటర్లు తెరుచుకోబోతున్నాయి.…

మార్చి 14 లగాయతు సినిమా విడుదల అన్నది, థియేటర్ల సందడి అన్నది మరిచిపోయారు అంతా. మళ్లీ థియేటర్లు కళకళలాడే సమయం దగ్గరకు వస్తోంది. డిసెంబర్ 4 నుంచి టెనెంట్ సినిమాతో కొన్ని థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఆ తరువాత 11 నుంచి మరి కొన్ని థియేటర్లు తెరుచుకునే అవకాశం వుంది. 

ఇదిలావుంటే ఓ సరైన క్రేజ్ వున్న సినిమా పడితే తప్ప మళ్లీ పూర్వ  వైభవానికి అంకురార్పణ జరగదు అని ఇండస్ట్రీ టాక్ వుంది. ఇప్పడు అలాంటి సినిమా విడుదల డేట్ వచ్చింది. సాయి ధరమ్ తేజ్ నటించిన సోలోబతుకే సో బెటరూ సినిమా ను డిసెంబర్ 25కు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  అలాగే రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ సినిమాను 11న విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతానికి 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడపాలి. అయితే ఎగ్జిబిటర్ల ఆలోచన వేరుగా వుంది. ఫ్యామీలీ మెంబర్లు ముగ్గురు నలుగురుగా వస్తే పక్క పక్క సీట్లు ఇచ్చేసినా తప్పలేదు. అలా ఇవ్వకపోయినా, సినిమా బిగిన్ అయ్యాక ఎలాగూ పక్క పక్కనే కూర్చుంటారు.

అందువల్ల లోకల్ గా ఎమ్మార్వోను మేనేజ్ చేయగలిగితే చాలు, ఇప్పటి వరకు సినిమాటికెట్ లు, అదనపు ఆటలు, అదనపు సీట్లు లాంటి వ్యవహారాలు లోకల్ ఎమ్మార్వోలను మేనేజ్ చేసి నడుపుకుంటూ రావడం అన్నది థియేటర్ యజమానులకు అలవాటే.

కనీసం 75 పర్సంట్ ఆక్యుపెన్సీ తెచ్చుకోవచ్చు. మీడియం సినిమాలు అన్నింటికీ 75 పర్సంట్ ఆక్యుపెన్సీ సరిపోతుంది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ అన్నది మరి కొన్ని నెలల పాటు వుంటుందని, ఇప్పట్లో ప్రభుత్వాలు వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వవని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అందువల్ల పెద్ద సినిమాలు ఏవీ సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు.

బాబుని వేటాడుతున్న భయం