నితిన్ సినిమాలు ఓవర్ బడ్జెట్

నితిన్ సినిమాలు రెండు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు రెడీ అవుతున్నాయి. కానీ కరోనా కారణంగా కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు రెండుసినిమాల కాస్త ఓవర్ బడ్జెట్ అయ్యాయని తెలుస్తోంది. భవ్య నిర్మించిన…

నితిన్ సినిమాలు రెండు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు రెడీ అవుతున్నాయి. కానీ కరోనా కారణంగా కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు రెండుసినిమాల కాస్త ఓవర్ బడ్జెట్ అయ్యాయని తెలుస్తోంది. భవ్య నిర్మించిన చెక్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన రంగ్ దే సినిమాలు రెండింటి బడ్జెట్ ముఫై కోట్లు దాడేసాయి. 

రంగ్ దే కు 30 కోట్ల వరకు అయితే చెక్ సినిమాకు 34 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. రంగ్ దే సినిమా స్టార్ట్ టు ఎండ్ 22 నెలలు పట్టింది. 60 రోజులకు పైగా వర్కింగ్ డేస్. పి సి శ్రీరామ్, దేవీశ్రీ, కీర్తి సురే్ష్ లాంటి జనాలు, కరోనా వడ్డీలు అన్నీ కలిపి 30 కోట్ల వరకు ఖర్చు అయిపోయింది.

చెక్ సినిమాకు కేవలం జైలు సెట్ వల్లనే నాలుగు నుంచి అయిదు కోట్లు ఖర్చయింది. అలాగే చంద్రశేఖర్ యేలేటి, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా గట్టి వ్యవహారమే వుంది. పైగా వంద రోజులు వర్కింగ్ డేస్, స్టార్టింగ్ టు ఎండ్ రెండేళ్లు పట్టడం వల్ల దానికీ ఖర్చు పెరిగిపోయింది. దాదాపు 34 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

రెండు సినిమాలు థియేటర్ నా? ఒటిటి నా? అన్న ఆలోచనలో వున్నాయి. చెక్ ఇంకా ఓటిటి బేరాల వరకు రాలేదు కానీ రంగ్ దే అయితే ముఫై ఎనిమిది నుంచి నలభై కోట్లు ఆశిస్తోంది. రెండు సినిమాలు దాదాపు రెడీ అయిపోయాయి. మరి కొద్ది రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయి విడుదలకు రెడీ అయిపోతాయి. అయితే సంక్రాంతి లేదా పోస్ట్ సంక్రాంతి బరిలోకి దిగుతాయా? ఒటిటికి వెళ్లాయా అన్నది వేచి చూడాలి.

బాబుని వేటాడుతున్న భయం