Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రచారానికి పవన్ దూరం

ప్రచారానికి పవన్ దూరం

అందరూ ఊహించినట్లే అయింది. కేసిఆర్ కు వ్యతిరేకంగా అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ప్రచారం చేయరని ముందుగానే ఊహాగానాలు వెలువడ్డాయి. అటు బాబు కానీ ఇటు పవన్ కానీ కేసిఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రచారం సాగించేంత ధైర్యం చేయరని రాజకీయ పరిశీలకులు అనుకున్నారు. అదే జరిగింది.

చంద్రబాబు నోట జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి ఒక్కటి అంటే ఒక్క మాట రాలేదు. ఒక్క పలుకు లేదు. ఓ స్టేట్ మెంట్ లేదు. పర్యటన లేనే లేదు. 

ఇక పవన్ కళ్యాణ్ పోటీకి దూరమైన భాజపాకు మద్దతు మాత్రం ప్రకటించారు.జనసైనికులు భాజపాకు ఓటేయమని ఓ ప్రకటన మాత్రం విడుదల చేసి ఊరుకున్నారు. అంతే తప్ప ఆయన హైదరాబాద్ వీధుల్లో ప్రచారానికి దిగలేదు. ఢిల్లీ వెళ్లక ముందు 28, 29 తేదీల్లో పవన్ హైదరాబాద్ లో ప్రచారం చేస్తారని అందుకు రోడ్ మ్యాప్ రెడీ అవుతోందని జనసేన వర్గాలు తెలిపాయి. 

కానీ పవన్ వ్యవహారం తెలిసిన వారు ఎవ్వరూ ఆ మాటలు విశ్వసించలేదు. ఇప్పుడు ఆఖరికి అదే నిజమైంది. పవన్ ప్రశాంతంగా తన ఇంట్లోనే వుంటున్నారు. ప్రచారానికి వెళ్లడం లేదు.  ఎక్కడెక్కడి నుంచో కీలమైన భాజపా నాయకులు ప్రచారానికి వచ్చారు.

వస్తున్నారు కానీ ఇక్కడ వున్న ఆ పార్టీ మద్దతు దారు పవన్ మాత్రం ప్రచారానికి వెళ్లడం లేదు. పైకి ఎన్ని బీరాలు పలికినా కేసిఆర్ కు వ్యతిరేకంగా వెళ్లేంత ధైర్యం అటు బాబు కానీ ఇటు పవన్ కానీ చేయరని అర్థమైపోయింది. 

అయితే వీళ్లే భవిష్యత్ లో కేసిఆర్ కు కాస్త తేడా వస్తే మాత్రం గొంతు లేపడంలో ముందుంటారు. అది మాత్రం పచ్చినిజం.

బాబుని వేటాడుతున్న భయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?