బీజేపీ నాయకులు తెల్లారిలేస్తే జగన్ మీద విరుచుకుపడతారు. ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్ సీటుకు కూడా గౌరవం ఇవ్వకుండా విపక్షాలు కొన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తూంటాయి.
అయితే రాజ్యాంగం ప్రకారం జగన్ ముఖ్యమంత్రి. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆయన్ని గౌరవించి తీరాల్సిందే. మరి ఈ విషయంలో ఏపీలోని చాలా పెద్ద పార్టీలు, ఇన్నేళ్ళు అన్నేళ్ళు రాజకీయ అనుభవం తమ సొంతం అని విర్రవీగిన సీనియర్ మోస్ట్ నేతలకు కూడా కళ్ళు తెరిపించేలా విశాఖకు చెందిన ఒక బీజేపీ నాయకుడు చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.
విశాఖలోని జీవీఎంసీ పరిధిలోని 42వ వార్డు బీజేపీ ప్రెసిడెంట్ అయిన గురు గోవింద్ సింగ్ తన వార్డు పరిధిలో ఉన్న ఆరు సచివాలయాల్లోనూ జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటంతో పాటు, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాలను తానే సొంతంగా తెచ్చి అక్కడ ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు.
రాజ్యాంగ స్పూర్తి అంటూ పెద్ద మాటలు మాట్లాడే నాయకులు ఈ బీజేపీ నేత తీరు చూసి మెచ్చాల్సిందే. ఇలాగే నాయకులు అందరూ వ్యవహరిస్తే రాజకీయ రచ్చ లేకుండా మన నేతలంతా పూజనీయులే అవుతారు కదా.