అజ్ఞాతవాసి చిత్రం నిజానికి పవన్‌కళ్యాణ్ ఇరవై అయిదవ చిత్రం కాదు. దానిని ల్యాండ్‌మార్క్ సినిమా అనడం కోసం ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’ సినిమాలో ఒక పాటలో అలా తళుక్కున మెరిసిన దానిని కూడా ఒక సినిమాగా లెక్క పెట్టేసారు.
అది ఇరవై అయిదవ సినిమాగా అఫీషియల్‌గా రికార్డ్ అవడంతో ‘వకీల్ సాబ్’ను పీఎస్‌పీకే26 అని పిలిచారు.అలాగే క్రిష్‌తో సినిమాకు 27, హరీష్ శంకర్ చిత్రానికి 2 టోకెన్ నంబర్లిచ్చారు. అయితే వకీల్ సాబ్ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో పవన్ సినిమా అనౌన్స్ చేసారు.
ఇదే ముందుగా పూర్తవుతుంది కానీ దీనికి పీఎస్‌పీకే టోకెన్ ఇవ్వలేదు. టైటిల్ పెట్టలేదు కానీ ఆ బ్యానర్ తాలూకు ప్రొడక్షన్ నంబర్ వేసుకున్నారు. దీంతో ఇప్పుడు పవన్ సినిమాల ఆర్డర్ మారిపోయింది.
క్రిష్ సినిమా కనీసం 2గా అయినా వస్తుందా లేదా తెలీదు. అలాగే హరీష్ శంకర్ సినిమా వెంటనే వుంటుందా లేదా అన్నదీ క్లారిటీ లేదు. ఈలోగా పవన్ ఏదైనా పర భాషా సినిమా చూసి నలభై, యాభై రోజుల్లో రీమేక్ చేసేయవచ్చునని భావిస్తే అది మొదలైనా ఆశ్చర్యం లేదు. పీఎస్‌పీకే ట్యాగ్ ఎలాగో అచ్చి రాలేదు కాబట్టి, ఈ అంకెలన్నీ తారుమారు అయిపోయాయి కాబట్టి ఇక ఫాన్స్ కూడా ఈ అంకె గారడీ పక్కన పెట్టేసుకోవచ్చు.