ఆలోచనలో ఆదర్శాలు- ఆచరణలో అద్భుతాలు

ఇటీవల TDF(అట్లాంటా) 2022 అధ్యక్ష పదవిని చేపట్టిన ప్రెసిడెంట్ శ్రీమతి స్వప్న కస్వా సమయంతో పోటీపడుతూ తమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడం హర్షణీయం. వివిధ వినూత్న మరియు ప్రయోజనకర ప్రణాళికలతో తెలుగువారందరినీ అలరించబోతున్నారని తెలియపరచిన…

ఇటీవల TDF(అట్లాంటా) 2022 అధ్యక్ష పదవిని చేపట్టిన ప్రెసిడెంట్ శ్రీమతి స్వప్న కస్వా సమయంతో పోటీపడుతూ తమ కార్యాచరణకు శ్రీకారం చుట్టడం హర్షణీయం. వివిధ వినూత్న మరియు ప్రయోజనకర ప్రణాళికలతో తెలుగువారందరినీ అలరించబోతున్నారని తెలియపరచిన శ్రీమతి స్వప్న తెలంగాణ విశిష్ఠ పండుగ బతుకమ్మను October 1 2022 న రంగరంగవైభవంగా జరుపాలన్న తమ ఉత్సాహానికి అద్దంపట్టేలా ముమ్మరంగా ఏర్పాట్లను చేపట్టారు. 

అందులో భాగంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ తొలి ఆహ్వానమును అందుకున్న తెలంగాణ ఆడపడుచు, ఉద్యమకారిని, గౌరవ MLC, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ KCR గారాలపట్టి శ్రీమతి కల్వకుంట్ల కవిత TDF బతుకమ్మ సంబరాలను స్వయంగా ప్రకటించారు.

ఇక రెండో అడుగు సేవా గమనం వైపు వేస్తూ అనాధాశ్రమాల ఆదరణలో భాగంగా కారుణ్యసింధు ఆశ్రమం మరియు జ్ఞానేశ్వర వాత్సల్య మందిరములనుండి బాల బాలికలను దత్తతు తీసుకున్నారు. ఆహార, విద్య,వైద్య వినోద మరియు విజ్ఞానాది దిశలలో వారికి అవసరమైన సదుపాయాలను మరియు ప్రోత్సాహక సేవలను అందజేయనున్నారు. ఈ క్రమంలో
ప్రభుత్వ సహకారం కొరకు విన్నవించగా శ్రీమతి కల్వకుంట్ల కవిత నిండు మనసుతో సహకార హస్తాన్ని అందించడం అభినందనీయం.

సహృదయంతో తలపెట్టు సకార్యాలకు సకలం శుభం పలుకునన్నట్లు నూతన అధ్యక్షురాలు తలపెట్టు సకల కార్యాలూ శుభప్రదం కావాలని కోరుకుంటూ అందుకు తెలంగాణ ఆత్మీయ మిత్రులైన తమరందరి తోడు ఉంటుందని TDF సదా విశ్వసిస్తుంది .

సర్వే జనా సుఖినోభవంతు.