లైఫ్ కు 30 శాతమే చాన్స్ అన్నారు-రానా

హీరో రానాకు కిడ్నీ సమస్య వుందని కొన్నేళ్ల క్రితం సడెన్ గా న్యూస్ బ్రేక్ అయింది. ఆ తరువాత వరుసగా దాని మీద అప్ డేట్స్ వస్తూనే వున్నాయి. కానీ ఏనాడూ రానా కానీ…

హీరో రానాకు కిడ్నీ సమస్య వుందని కొన్నేళ్ల క్రితం సడెన్ గా న్యూస్ బ్రేక్ అయింది. ఆ తరువాత వరుసగా దాని మీద అప్ డేట్స్ వస్తూనే వున్నాయి. కానీ ఏనాడూ రానా కానీ ఆయన ఫ్యామిలీ కానీ దాని మీద స్పందించలేదు.

ఆ తరవాత ఆయన అమెరికాలో చికిత్స చేయించుకున్నారని, దగ్గర వాళ్లే కిడ్నీ ఇచ్చారని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. ఒక్కోసారి రానా వీటిని ఖండించినట్లు మాట్లాడాడు కానీ, ఏనాడూ అంగీకరించినట్లు మాట్లాడలేదు.

తొలిసారి శామ్ జామ్ షో లో తన అనారోగ్యం విషయం గురించి సవివరంగా మాట్లాడాడు. అరణ్య సినిమా ప్రిపరేషన్ లు జరుగుతున్నపుడు కంటికి లాసిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్నానని, తనకు అప్పటి వరకు ఓ ప్రత్యేకమైన లెన్స్ కంటికి అవసరం వుండేదని వెల్లడించాడు.

అప్పుడు డాక్టర్ తన ఆరోగ్యం గురించి తొలిసారి అనుమానం పడ్డారని, పలువురు డాక్టర్లు చకచకా పరిక్షలు చేస్తే తనకు బిపి వుండల్సిన దానికన్నా డబుల్ వున్నట్లు తేలిందన్నారు. వెంటనే అమెరికా వెళ్లి పరీక్షలు చేయించుకుంటే డాక్టర్లు 70 శాతం స్ట్రోక్ రావడానికి అవకాశం వుందని, 30శాతమే లైఫ్ కు చాన్స్ వుందని చెప్పారన్నారు.

ఎంతో భోజనం, అన్ని రకాల ఫుడ్ తీసుకునే అలవాటు వున్న తాను రాత్రికి రాత్రి అన్నీ వదిలేయాల్సి వచ్చిందన్నారు. అతి కొద్ది ఆహారం, అది కూడా ఉప్పు లేకుండా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సాధారణంగా మనం పెద్ద అవుతుంటే తల్లితండ్రులతో బాండింగ్ తగ్గిపోతుందని, కానీ ఈ అనారోగ్యం కారణంగా అమ్మ..నాన్నలకు బాగా దగ్గరయ్యానని రానా చెప్పుకువచ్చాడు.

సొంత పరువు కూడా బాబుకి తాకట్టు