ఎఫ్ 3 సినిమా ఏ ముహుర్తాన అనుకున్నారో అప్పటి నుంచి అవరోథాలే. ఒక్కోటీ మెల్లగా దాటుకుంటూ వస్తుంటే, మరోటి తెరపైకి వస్తోంది. ముందుగా చకచకా స్క్రిప్ట్ వర్క్ అరకులోయ, వైజాగ్ ల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఫినిష్ చేసారు.
ఈలోగా కరోనా స్టార్ట్ అయింది. అయినా లెక్క చేయకుండా అనిల్, ఆయన టీమ్ వాళ్ల ఊరికి వెళ్లి అక్కడ స్క్రిప్ట్ ఫినిష్ చేసారు.కానీ ఒక హీరో వెంకీ దగ్గర నుంచి సమస్య స్టార్ట్ అయింది.
నిర్మాణంలో భాగస్వామ్యం అన్న దగ్గర సురేష్ బాబు బేరాలు స్టార్ట్ అయ్యాయి. కిందా మీదా పడి, ఆఖరికి ఏదో ఒక పాయింట్ దగ్గర సెట్ చేసుకున్నారు. లాభంలో వాటానో, మరోటో మొత్తానికి దాదాపు 13 కోట్ల వరకు వెంకీ కి ముట్టేలా అగ్రిమెంట్ లు జరిగాయని బోగట్టా.
అయితే అక్కడే చిన్న సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ 3 గురించి వరుణ్ తో మాట్లాడినపుడు ఈసారి వెంకీతో సమానంగా రెమ్యూనిరేషన్ ఇస్తాం అని దిల్ రాజు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే వెంకీతో డీల్ కుదిరిందో అదే విధంగా తనకు ఇవ్వాలని వరుణ్ పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎఫ్ 3 సీక్వెల్ కావడంతో, ఆ సినిమాలో స్టార్స్ నే అవసరం కావడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దిల్ రాజు ప్రస్తుతం ఈ పజిల్ ను కూడా సాల్వ్ చేసే పనిలోబిజీగా వున్నట్లు బోగట్టా.