అంతా అయోమయంగా ఉందిట…?

అంకెలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటితో పాటే ఆర్భాటంగా ప్రకటనలూ వినిపిస్తున్నాయి. మరీ ఈ రెండింటినీ గుదిగుచ్చి మెదడులో ఎక్కించుకోవడానికే చాలా చాలా ఇబ్బంది అవుతోందిట. అవును దాని పేరే  కేంద్ర బడ్జెట్. ఈ బడ్జెట్…

అంకెలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటితో పాటే ఆర్భాటంగా ప్రకటనలూ వినిపిస్తున్నాయి. మరీ ఈ రెండింటినీ గుదిగుచ్చి మెదడులో ఎక్కించుకోవడానికే చాలా చాలా ఇబ్బంది అవుతోందిట. అవును దాని పేరే  కేంద్ర బడ్జెట్. ఈ బడ్జెట్ ఏంటో, దాని యవ్వారం ఏంటో, కంప్లీట్ కంఫ్యూజన్ బాబూ అంటున్నారు నేతాశ్రీలు అంతా.

ఇక వైసీపీ మంత్రులు అయితే కేంద్ర బడ్జెట్ మీద పెదవి విరిచేశారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అయితే  ఈ బడ్జెట్ చాలా సెక్షన్లకే కాదు ఏపీని పూర్తిగా విస్మరించిందని ఘాటైన మాటలే చెప్పారు. ఈ బడ్జెట్ లో రైతులు, పేదలు, యువత, వేతన జీవులు ఇలా ఏ వర్గం చూసుకున్నా నిరాశే మిగులుతుంది అంటున్నారు.

మరో మంత్రి సీదరి అప్పలరాజుకైతే ఈ బడ్జెట్ అంతా అయోమయంగానే ఉంది అంటున్నారు. అసలు ఏపీకి ఏమి చేశారో కూడా ఈ బడ్జెట్ లో చెప్పలేకపోయింది అని నిందించారు. ప్రత్యేక హోదా ఊసు ఉందా, రైల్వే జోన్ గురించి ఆలోచన చేశారా, పోలవరాన్ని పక్కన పెట్టేసి ఏపీని పూర్తిగా వెనక్కి నెట్టేసారు. ఇలా అన్నీ అన్యాయమే చేసి బ్రహ్మాండమైన బడ్జెట్ అంటూంటే మంత్రి గారికి అయోమయంగానే ఉందిట.

టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే ఏందుకు ఏపీ మీద ఈ వివక్ష అని నిలదీస్తున్నారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఒక్కటైనా ఉన్నాయా అని కేంద్ర పెద్దలను నిలదీస్తున్నారు. ఇక సీపీఐ లాంటి పార్టీలు అయితే ఈ బడ్జెట్ మీద మంచి రైమింగ్ తో సెటైర్ పేల్చారు. సీతమ్మ పద్దు, కార్పోరేటర్లకే ముద్దు అని సీపీఐ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు కామెంట్స్ చేశారు.

రైల్వే జోన్ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితులు తెచ్చారు అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నా, ఇతర నాయకులు బడ్జెట్ మీద ఆశే లేదు అని మాట్లాడేందుకు వెనక్కి తగ్గినా కూడా ఇది మంచి బడ్జెట్ అని బీజేపీ నేతలు అంటున్నారు. మరి వారికి మంచి అయినది విపక్షాలు చెడ్డగా కనిపిస్తోంది అంటే ఇది అయోమయమైన బడ్జెట్ గానే చూడాలేమో.