పక్కా..పక్కా..పక్కా కమర్షియలే..

పైసామే పరమాత్మ అన్నారు. డబ్బు లేనివాడు డబ్బు కైనా కొరగాడు అన్నారు. హీరో గోపీచంద్ కూడా ఇలాంటి రాగమే అందుకున్నాడు పక్కా కమర్షియల్ సినిమాలో.  Advertisement మారుతి కథ, డైరక్షన్ లో జిఎ2 బన్నీవాస్,…

పైసామే పరమాత్మ అన్నారు. డబ్బు లేనివాడు డబ్బు కైనా కొరగాడు అన్నారు. హీరో గోపీచంద్ కూడా ఇలాంటి రాగమే అందుకున్నాడు పక్కా కమర్షియల్ సినిమాలో. 

మారుతి కథ, డైరక్షన్ లో జిఎ2 బన్నీవాస్, యువి వంశీ నిర్మించే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేసారు.

దివంగత గీత రచయిత సిరివెన్నెల రచించిన ఈ పాటను జేమ్స్ బిజోయ్, హేమచంద్ర ఆలపించారు. పాటకు జేమ్స్ బిజోయ్ ట్యూన్ అందించారు. చిన్న బీట్ టచ్ ఇచ్చి, పక్కా కమర్షియలే అనే హుక్ లైన్ తో సాగిన పాట వినగా వినగా పట్టేలాగే వుంది.

ఈ మధ్యకాలంలో, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే జిల్ సినిమా తరువాత హీరో గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంత అందంగా వుండడం ఇదే. సినిమా కలర్ ఫుల్ గా వుంటుందిని పాట చిన్న హింట్ ఇచ్చింది. ఇప్పటికే పనులు అన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా వుంది.