డిజె వాయించేసాడు టిల్లు

ఈ మధ్యకాలంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యూత్ ఫిలిం రాలేదు. యూత్ ఫిలిం అంటున్నారే తప్ప, అందులో మాస్ మిక్స్ అన్నది పక్కాగా జ‌రగడం లేదు. అయితే ఎడ్జ్ దాటడం లేదంటే పండకపోవడం.…

ఈ మధ్యకాలంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యూత్ ఫిలిం రాలేదు. యూత్ ఫిలిం అంటున్నారే తప్ప, అందులో మాస్ మిక్స్ అన్నది పక్కాగా జ‌రగడం లేదు. అయితే ఎడ్జ్ దాటడం లేదంటే పండకపోవడం. ఈ రోజు విడుదలయిన డిజె టిల్లు ట్రయిలర్ చూస్తుంటే ఆ కొరత తీరేలాగే కనిపిస్తోంది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, మాటలు అందిస్తూ చేసిన సినిమా డిజె టిల్లు. నాగవంశీ నిర్మాత. ఈ సినిమా ట్రయిలర్ అవుట్ అండ్ డైలాగ్ బేస్డ్ కామెడీగా వుంది. పక్కా హైదరాబాదీ యాక్సెంట్ లో, సిద్దు రాసిన డైలాగులు అన్నీ కుర్రకారుకు పట్టే లాగే వున్నాయి.

అక్కడక్కడ చిన్న బొర్డర్ దాటినా కుర్రకారును కుర్చీలోంచి లేపి గెంతులేయించడం కోసం ఆ మాత్రం వుండాల్సిందే అనేలా వున్నాయి. కానీ గమ్మత్తేమిటంటే ఇంత ట్రయిలర్ చూసినా కథ లైన్ మాత్రం అస్సలు ఊహకు అందకుండానే వుంది. 

సినిమా క్లయిమాక్స్ కూడా ఫన్ టోన్ లోనే వుంటుందని అర్థం అయిపోతోంది. మొత్తం మీద ప్రామిసింగ్ గానే వుంది ట్రయిలర్.