మైత్రీ పై దాడి వెనుక ముంబాయి ట్రాన్సాక్షన్!

మైత్రీ మూవీస్ ..తెలుగులో భారీ..పాపులర్ నిర్మాణ సంస్థ. సాధారణంగా హిట్ సినిమా పడగానే, లేదా విడుదలవుతుంటే చాలు ఐటి రెయిడ్ అన్నది కామన్. కానీ శ్రీమంతుడు నుంచి పుష్ప వరకు అనేక బ్లాక్ బస్టర్లు…

మైత్రీ మూవీస్ ..తెలుగులో భారీ..పాపులర్ నిర్మాణ సంస్థ. సాధారణంగా హిట్ సినిమా పడగానే, లేదా విడుదలవుతుంటే చాలు ఐటి రెయిడ్ అన్నది కామన్. కానీ శ్రీమంతుడు నుంచి పుష్ప వరకు అనేక బ్లాక్ బస్టర్లు తీసినా ఏనాడూ ఐటి దాడి అన్నది మైత్రీ మీద జరగలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా నాన్ హైదరాబాద్ టీమ్ లు బుధవారం ఉదయాన్నే వచ్చి పడ్డాయి. అది కూడా వెల్ ప్లాన్డ్ గా అని సమాచారం.

ఎంత వెల్ ప్లాన్డ్ గా అంటే సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో ఎవరు కీలకం, ఎవరు ఏ బాధ్యతలు నమ్మకంగా నిర్వహిస్తారు, వాళ్ల చిరునామాలు ఇవన్నీ తెలుసుకుని మరీ. సంస్థ కు నమ్మకంగా కొన్ని బాధ్యతలు నిర్వహించే ఓ ఉద్యోగిని నేరుగా వెళ్లి, ఆఫీసుకు తీసుకువచ్చారు ఐటి అధికారులు అని తెలుస్తోంది. అలాగే దర్శకుడు సుకుమార్, ఆయన సుకుమార్ రైటింగ్స్ తో సంబంధాలున్న నిర్మాతలను కూడా తెచ్చినట్లు బోగట్టా.

ఇవన్నీ ఇలా వుంచితే ముంబాయిలో జరిగిన ఓ ట్రాన్సాక్షన్ లింక్ పట్టుకుని ఐటి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రాన్సాక్షన్ మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఓ భారీ హవాలా ట్రాన్సాక్షన్ అది అని కీలకంగా వినిపిస్తోంది. దాని వల్లే ఇంతవరకు వచ్చింది వ్యవహారం అని టాక్.

ఇదిలా వుంటే పొలిటికల్ మనీ మైత్రీ లో వుందనే వార్తలు కరెక్ట్ కాదని, 2019 ఎన్నికల టైమ్ లోనే అవి వెనక్కు వెళ్లిపోయాయని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఇదిలా వుంటే కొన్ని వందల కోట్ల ఎన్నారై ఫండ్స్ మైత్రీకి వచ్చాయని నిన్న అంతా ప్రచారం ఎక్కువగా సాగింది..

మొత్తం మీద మైత్రీ మీద ఐటి దాడులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. కానీ ఒక్కటి నిజం. ఐటి దాడులు ఎప్పుడు ఏ సంస్థ మీద జరిగినా, దాని వెనుక అసలు విషయాలు ఏమి వున్నా, అటు అధికారులకు, ఇటు సంస్థల కీలక వ్యక్తులకు తప్ప వేరే వారికి ఎప్పటికీ నూటికి నూరు శాతం తెలియవు. ఇలా గ్యాసిప్ లే చలామణీ అవుతాయి.