మరోసారి సందడి చేయబోతున్న సమంత

ఊ అంటావా..ఊఊ అంటావా అంటూ దాదాపు నెల రోజులుగా ఊపేసింది సమంత. ఆ సాంగ్, అందులో ఆమె మేనరిజమ్స్, దానికి సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అది…

ఊ అంటావా..ఊఊ అంటావా అంటూ దాదాపు నెల రోజులుగా ఊపేసింది సమంత. ఆ సాంగ్, అందులో ఆమె మేనరిజమ్స్, దానికి సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అది కాస్త తగ్గుముఖం పడుతుందనుకున్న టైమ్ కు మరో సంచలనంతో ముందుకు రాబోతోంది సమంత.

సమంత నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శాకుంతలం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది సమంత. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. పురాణాలకు చెందిన శాకుంతల-దుష్యంతుడి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి హాట్ టాపిక్ అవ్వబోతోంది సమంత. ఆమె లుక్ నేషనల్ లెవెల్లో పాపులర్ అవుతుందని అంటున్నారు మేకర్స్.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది శాకుంతలం. గుణశేఖర్, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కుదిరితే ఈ నెలలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఇది ఆధారపడి ఉంది. గ్రాఫిక్ వర్క్ అంతా కొలిక్కి వచ్చినట్టు భావిస్తే ఫస్ట్ లుక్ విడుదల తేదీని ప్రకటిస్తారు. ఆ వెంటనే ఒక్కొక్కటిగా లిరికల్ వీడియోస్ ను విడుదల చేస్తారు.

దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తొలిసారిగా నటించింది. ఆమె ఇందులో చిన్ననాటి భరతుడి పాత్రను పోషించింది. ఇక కబీర్ దుహాన్ సింగ్ రాక్షస రాజుగా కనిపించనున్నాడు.

ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఆశిస్తోంది సమంత. ది ఫ్యామిలీ మేన్-2, పుష్ప సినిమాలతో వచ్చిన క్రేజ్ ను శాకుంతలంతో కొనసాగించాలనుకుంటోంది.