గీతా 2, యువి కలిపి నిర్మించి సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగే సినిమా విడదులయింది. పెద్ద హిట్ అయిపోయింది. డబ్బులు ఫుల్ గా వచ్చేసాయి. ఇప్పుడు ఆ సినిమా ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లోకి వచ్చింది. ఫ్రీగా సినిమాలు చూసే జనం అంతా ఇప్పుడు ఆ సినిమా మీద పడ్డారు. ఇలాంటి టైమ్ లో దర్శకుడు మారుతి మీద, ప్రతి రోజూ పండగే సినిమా మీద ట్రోలింగ్ మొదలయింది.
తండ్రి ప్రాణాలు, చావు మీద జోకులువేస్తారా? ఎన్నారై కొడుకులు అంటే అంత చీప్ గా వున్నారా? ఇలా రకరకాలుగా దర్శకుడు మారుతి ని ఆడేసుకుంటున్నారు. అయితే మామూలుగానే దర్శకుడు మారుతి కామెడీ విషయంలో కాస్త ఓవర్ ది బోర్డ్ వెళ్తారు. అలా అయితే బి, సి సెంటర్ల ఆడియన్స్ కు ఫన్ రీచ్ అవుతుందని ఆయన ఐడియా.
ఫ్రతి రోజూ పండగే సినిమా విషయంలో కూడా అదే చేసారు. అది వర్కవుట్ అయింది. కానీ క్లాస్ ఆడియన్స్ , లేటెస్ట్ గా ఎన్నారై ఆడియన్స్ మాత్రం ఈ సీన్లను యాక్సెప్ట్ చేయడం లేదు. ముఖ్యంగా సమాధులు, శవ ఊరేగింపు వాహనం లాంటి సీన్లు ఎక్కువ విమర్శకు గురి అవుతున్నాయి. చిత్రమేమిటంటే, ఓవర్ సీస్ లొ కూడా ప్రతి రోజూ పండగే సినిమాలు లాభాలే ఆర్జించింది. అప్పుడు చూడని వాళ్లు ఇప్పుడు చూసి, ట్రోలింగ్ చేయడం విశేషం.