ఇక యాభై సెంటర్ల పోటీ

సరిలేరు, అల వైకుంఠపురములో సినిమాలు విడుదలకు ముందు నుంచి ఇప్పటి వరకు పోటా పోటీగానే వున్నాయి. ప్రతి విషయంలో రెండింటి మధ్య పోటీ కనిపిస్తూనే వుంది. అటో పోస్టర్, ఇటో పోస్టర్ అన్నట్లుగా వుంది…

సరిలేరు, అల వైకుంఠపురములో సినిమాలు విడుదలకు ముందు నుంచి ఇప్పటి వరకు పోటా పోటీగానే వున్నాయి. ప్రతి విషయంలో రెండింటి మధ్య పోటీ కనిపిస్తూనే వుంది. అటో పోస్టర్, ఇటో పోస్టర్ అన్నట్లుగా వుంది వ్యవహారం. హిట్ నా, బ్లాక్ బస్టర్ నా, ఇండస్ట్రీ హిట్ నా అనే వార్ అయిపోయింది. కలెక్షన్ల వార్ ముగిసింది. ఇక ఇప్పుడు యాభై సెంటర్ల వార్ మొదలయింది.

ఈ రెండు సినిమాలు ఎన్ని సెంటర్లలో యాభై రోజుల రన్ చూపిస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ విషయం మీద రెండు యూనిట్ లు కసరత్తు మొదలెట్టినట్లు బోగట్టా. ఇప్పడు దగ్గర దగ్గర ముఫై రోజులు అవుతోంది. సినిమాలు ఇంకా మరో ఇరవై రోజులు థియేటర్లలో వుండడం అంటే మాటలు కాదు. పైగా వారం వారం ఏదో ఒక సినిమా వస్తూనేవుంది.

శర్వానంద్-సమంత ల జాను, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్, నితిన్ భీష్మ సినిమాలు రానున్నాయి. అందువల్ల షేర్ కాస్తా డెఫిసిట్ గా మారే ప్రమాదం వుంది. ఇప్పటికి చాలా సెంటర్లలో సరిలేరు సినిమా సింగిల్ స్క్రీన్ లకు పరిమితం అయిపోయింది. కానీ అలవైకుంఠపురములో చాలా చోట్ల డబుల్ స్క్రీన్ లు వున్నాయి. పైగా సరిలేరు కు వస్తున్న షేర్ కన్నా, అల కు వస్తున్న షేర్ ప్రతి జోటా డబుల్ గా వుంది. 

అందువల్ల ఇప్పుడు ఎక్కడ ఎక్కడ షేర్ బాగుంది. యాభై రోజుల వరకు మాగ్జిమమ్ నిల్చుంటుంది లాంటి లెక్కలు కడుతున్నారు. అప్పుడు ఎన్ని సెంటర్లు అవుతాయి. మరి కొన్ని సెంటర్లు కావాలంటే ఏం చేయాలి? ఎంత డెఫిసిట్ వస్తుంది? ఓవర్ ఫ్లోస్ లోంచి ఎంత పోతుంది? లాంటి విషయాలు ఆరా తీస్తున్నారు. దీన్ని బట్టి యాభై రోజుల సెంటర్లు డిసైడ్ అవుతాయి.

కానీ ఇక్కడ సరిలేరుకు కాస్త సమస్యే. ఎందుకంటే అల కు పోటీగా సెంటర్లు వుంచాలి అంటే బయ్యర్లకు సమస్య అవుతుంది. షేర్ కాస్తా డెఫిసిట్ గా మారి, లాభాలకు కన్నం పడుతుంది. నిర్మాత భరిస్తాను అంటే తప్ప బయ్యర్లు ఓకె అనకపోవచ్చు.  మరో పది రోజులు ఆగితే యాభై రోజుల సెంటర్ల సంఖ్యపై క్లారిటీ వస్తుంది.

బాలయ్య గుండు సీక్రెట్ అదేనా?