టాలీవుడ్ కు కొత్త పద్ధతి నేర్పించిన రాజమౌళి

బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లాడు రాజమౌళి. ఇప్పుడిదే దర్శకుడు టాలీవుడ్ కు మరో కొత్త పద్ధతి కూడా నేర్పించాడు. అదే రిలీజ్ డేట్స్ వ్యవహారం.  Advertisement ఇంతకుముందు ఏ…

బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లాడు రాజమౌళి. ఇప్పుడిదే దర్శకుడు టాలీవుడ్ కు మరో కొత్త పద్ధతి కూడా నేర్పించాడు. అదే రిలీజ్ డేట్స్ వ్యవహారం. 

ఇంతకుముందు ఏ సినిమాకైనా ఒక తేదీ ప్రకటించేవారు. కుదరని పక్షంలో ఆ తర్వాత మరో తేదీ ప్రకటించేవారు. కానీ ఇప్పుడు చాలామంది నిర్మాతలు తమ సినిమాలకు రెండేసి తేదీలు ప్రకటిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు తేదీలపై రెండు కర్చీఫ్ లు వేసే సంస్కృతిని టాలీవుడ్ కు అలవాటు చేశాడు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి గతంలో రెండు విడుదల తేదీలు ప్రకటించాడు రాజమౌళి. ఆ తర్వాత ఆ రెండు తేదీలు కాకుండా మరో తేదీకి సినిమాను విడుదల చేయబోతున్నట్టు తాజాగా ఎనౌన్స్ చేశాడు. అది వేరే విషయం. ఇప్పుడీ రెండు తేదీల ఫార్మాట్ ను చాలామంది ఫాలో అవుతున్నారు.

భీమ్లానాయక్ మేకర్స్ కూడా రెండు తేదీలు ప్రకటించారు. కుదిరితే ఫిబ్రవరి 25, కుదరకపోతే ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు తాజాగా గని నిర్మాతలు కూడా అదే పని చేశారు. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమాను వీలైతే ఫిబ్రవరి 25న, వీలు కాకపోతే మార్చి 4న విడుదల చేస్తామని ప్రకటించారు.

ఈ సినిమాలతో పాటు త్వరలోనే మరో 2 పెద్ద సినిమాలు కూడా ఇదే విధంగా 2 రిలీజ్ డేట్స్ ఫార్ములాను ఫాలో అవ్వబోతున్నాయి. మొత్తమ్మీద రిలీజ్ డేట్స్ విషయంలో టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. ఇది కూడా రాజమౌళి పుణ్యమే.