ఆ విష‌యం మీకెలా తెలుసుః హైకోర్టు కీల‌క ప్ర‌శ్న‌

నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ ఉద్యోగులు ఉద్య‌మ బాట ప‌ట్ట‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నెల‌లో స‌మ్మె బాట ప‌ట్టేందుకు ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌భుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. స‌మ్మె నోటీసుతో ప్ర‌భుత్వం ఎలాగైనా…

నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ ఉద్యోగులు ఉద్య‌మ బాట ప‌ట్ట‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నెల‌లో స‌మ్మె బాట ప‌ట్టేందుకు ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌భుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. స‌మ్మె నోటీసుతో ప్ర‌భుత్వం ఎలాగైనా దిగొచ్చి, త‌మ గొంతెమ్మ కోర్కెలు తీరుస్తుంద‌నే ఆశ‌తో ఉద్యోగులున్నారు. మ‌రోవైపు నూత‌న పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు త‌గ్గుతాయ‌నే వాద‌న‌ను వారు తెర‌పైకి తెచ్చారు.

అంత‌టితో ఆగ‌లేదు. నూత‌న పీఆర్సీ జీవోను స‌వాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్య‌క్షుడు కేవీ కృష్ణ‌య్య హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై ఇవాళ హైకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అస‌లు జీతాలు ప‌డ‌కుండానే, త‌గ్గుతున్నాయ‌నే విష‌యం మీకెలా తెలుస‌ని ధ‌ర్మాస‌నం పిటిష‌న‌ర్‌ని ప్ర‌శ్నించింది.

సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే అని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది  ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ ఉద్యోగులు అనవసర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు.  

ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇదే సంద‌ర్భంలో ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్ద‌ని హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. అనంత‌రం విచార‌ణ‌ను మూడు వారాలు వాయిదా వేసింది.