జగన్ అంటే అసూయ…ఈర్ష్య నిండా అజ్ఞానం

జగన్ అన్న పేరు వింటేనే ఆయనకు అసూయ ఈర్ష్య కలుగుతాయట. ఆయన ఎవరు అన్నది రోజూ రాజకీయాల గురించి తెలుసుకునే వారికి అర్ధమయ్యే విషయమే. ఆయనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆయన ఏ…

జగన్ అన్న పేరు వింటేనే ఆయనకు అసూయ ఈర్ష్య కలుగుతాయట. ఆయన ఎవరు అన్నది రోజూ రాజకీయాల గురించి తెలుసుకునే వారికి అర్ధమయ్యే విషయమే. ఆయనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆయన ఏ విషయం మీద మాట్లాడినా తిప్పి తిప్పి జగన్ మీదకే వస్తారు. జగన్ సీఎం ఈ రెండు కలిపి చదవడానికి ఇబ్బంది పడుతున్న రాజకీయ నాయకుడు పవన్ అని వైసీపీ నేతలు అంటారు.

పవన్ కళ్యాణ్ జగన్ మీద అసూయ ఈర్ష్య ద్వేషాలతో అసలు తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా మరచిపోతున్నారని, నిండా అజ్ఞానంలో కూరుకుపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ జగన్ మీద కోపం పెట్టుకుని దేన్ని విమర్శించాలో దేన్ని సమర్ధించాలో కూడా తెలియనంతగా ఉన్నారని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణాకు క్షమాపణలు చెప్పాలని పవన్ అన్న మాట ఆయన అజ్ఞానం గురించి చెబుతోందని ఆమె అంటున్నారు. పవన్ రాజకీయాలు ప్రజా సేవ సంగతేమో కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తెలంగాణ దొరల పాదాల వద్ద తాకట్టు పెట్టవద్దని ఆమె హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు. అక్కడ ప్రజలు పడుతున్న అవస్థల మీద ఏ రోజూ మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇపుడు వారి మనోభావాల గురించి దెబ్బ తింటాయంటూ మాట్లాడడం అంటే ఏమనుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఈ రకమైన వైఖరితో పవన్ ప్రకటనలు హాస్యాస్పదం అవుతున్నాయని అది గుర్తించాలని  కోరారు. 

పవన్ కళ్యాణ్ తన తీరుని ఇకనైనా మార్చుకోవాలని ఆమె సూచించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ ద్వేషంతో అంతులేని అసూయతో పనిగట్టుకుని జగన్ మీద విమర్శలు చేయడం కాదని పవన్ గుర్తుంచుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. పవన్ చేసిన తెలంగాణకు క్షమాపణలు అన్న డిమాండ్ అయితే బూమరాంగ్ అయిందనే అంటున్నారు.