‘ఏజెంట్’ మీద రాజకీయం?

టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఏజెంట్ సినిమా తెర వెనుక ఏదో జరుగుతోందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హోల్ సేల్ గా ఓ బయ్యర్ కొన్నారు. అప్పటి నుంచి…

టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ రాజకీయాలు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఏజెంట్ సినిమా తెర వెనుక ఏదో జరుగుతోందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హోల్ సేల్ గా ఓ బయ్యర్ కొన్నారు. అప్పటి నుంచి ఈ రాజకీయాలు, తెరవెనుక మంతనాలు మొదలయ్యాయంటూ టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

హోల్ సేల్ అమ్మకం జరిగిన తరువాత కొన్నాళ్ల క్రితం ఆంధ్రలో తలొకరు తలో ఏరియాకు చకచకా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్లు కూడా నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ మీద కాకుండా కేవలం అడ్వాన్స్ మీద పంపిణీకి వెళ్లేలా తెర వెనుక రాజకీయాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక థియేటర్ల కేటాయింపు వ్యవహారం మామూలే. ఏజెంట్ సినిమాకు పెద్దగా పోటీ లేదు. ముందు వారం విరూపాక్ష విడుదలవుతోంది. సేమ్ డే నాడు పిఎస్ 2 విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకు థియేటర్ల ఇచ్చినా, ఇంకా చాలా థియేటర్లు అవైలబుల్ గా వుంటాయి. కానీ అది మాత్రమే సమస్య కాదు. కీలకమైన థియేటర్లు అన్నది కూడా సమస్యనే. ఈ దిశగా కూడా కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నైజాంలో పిఎస్ 2 కు చాలా అంటే చాలా థియేటర్ల అగ్రిమెంట్లు పూర్తయిపోయాయి.

ఏజెంట్ సినిమా విడుదల దగ్గరకు వస్తే మొత్తం వ్యవహారాలు అన్నీ క్లారిటీగా బయటకు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది. రాజకీయాలు ఏ మేరకు ఫలించాయో..ఏ మేరకు ఫలించలేదో అన్నది.

కానీ ఇక్కడ కండిషన్ ఒక్కటే. ఈ రోజు ట్రయిలర్ విడుదలవుతోంది. అది బ్లాక్ బస్టర్ రేంజ్ లో వుంటే ఈ రాజకీయాలు అన్నీ పటాపంచలైపోతాయి.