తల్లి కాబోతున్న ఇలియానా

అసలు ఇలియానాకు పెళ్లయిందా? ఆమె భర్త ఎవరు? ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఆమె తల్లి కాబోతోంది. త్వరలోనే ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించబోతోంది. ఇది మాత్రం ఫిక్స్. Advertisement తను తల్లిని కాబోతున్న…

అసలు ఇలియానాకు పెళ్లయిందా? ఆమె భర్త ఎవరు? ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఆమె తల్లి కాబోతోంది. త్వరలోనే ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించబోతోంది. ఇది మాత్రం ఫిక్స్.

తను తల్లిని కాబోతున్న విషయాన్ని ఇలియానా స్వయంగా ప్రకటించింది. 2 ఫొటోలు షేర్ చేసింది. ఒక ఫొటోలో అడ్వెంచర్ మొదలైంది అనే క్యాప్షన్ తో టీ-షర్ట్ ను ఉంచింది. ఇక రెండో ఫొటోలో తన మెడలో వేసుకున్న చిన్న చైన్ ను చూపించింది. అందులో మామా అని రాసుంది.

ఈ రెండు ఫొటోలతో పాటు బుజ్జి డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉందనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఆమె త్వరలోనే ఓ బిడ్డకు తల్లికాబోతోందనే మేటర్ బయటకొచ్చింది.

ఇంతకీ బిడ్డకు తండ్రి ఎవరు..?

తను తల్లి కాబోతున్నానంటూ ఇలియానా ప్రకటించిన వెంటనే, వందల సంఖ్యలో కామెంట్స్ పడుతున్నాయి. కొంతమంది శుభాకాంక్షలు చెబుతుంటే, మరికొంతమంది మాత్రం పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూను గతంలో పెళ్లాడింది ఇలియానా. అయితే ఆ పెళ్లి త్వరగానే పెటాకులైంది. అప్పట్నుంచి ఆమె సింగిల్ గానే ఉంటోంది. ప్రస్తుతం ఆమె లైఫ్ పార్టనర్ ఎవరనేది అధికారికంగా ఎవ్వరికీ తెలియదు.

ఇలాంటి టైమ్ లో తన జీవితంలోకి బిడ్డను ఆహ్వానించబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది ఇలియానా. బిడ్డ పుట్టిన తర్వాత భర్తను పరిచయం చేస్తుందని కొందరు అంటుంటే, సరోగసీ లేదా దత్తత తీసుకోవడం ద్వారా ఇలియానా తల్లి అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు మరికొంతమంది.