మారుతి-ప్రభాస్ సినిమా షూట్ చకచకా

కుందేలు గెలుస్తుంది అనుకుంటే తాబేలు గెలిచినట్లు, భారీ సినిమాలు, వీటి మధ్య ఓ చిన్న సినిమా అన్నట్లుగా కనిపించింది మారుతి-ప్రభాస్-పీపుల్స్ మీడియా సినిమా. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె ఇలాంటి వందల కోట్ల సినిమా…

కుందేలు గెలుస్తుంది అనుకుంటే తాబేలు గెలిచినట్లు, భారీ సినిమాలు, వీటి మధ్య ఓ చిన్న సినిమా అన్నట్లుగా కనిపించింది మారుతి-ప్రభాస్-పీపుల్స్ మీడియా సినిమా. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె ఇలాంటి వందల కోట్ల సినిమా మధ్య దర్శకుడ మారుతితో సినిమా ఏంటీ అని ఫ్యాన్స్ కూడా కిందా మీదా అయ్యారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే మారుతి-ప్రభాస్ సినిమానే చకచకా షూట్ జరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.

ఏమాత్రం గ్యాప్ దొరికినా ప్రభాస్ ఈ సినిమా షూట్ కు వచ్చేస్తున్నారు. మిగిలిన వారి వర్కింగ్ స్టయిల్ కు మారుతి వర్కింగ్ స్టయిల్ కు తేడా వుంది. ఎలా వుంటే అలా నడిపించడంలో ఆయన ముందు వుంటారు. ఇలాగే వుండాలి. ఇలాగే చేయాలి అని గీసుకుని కూర్చోరు. అందుకే సెట్ లు రెడీగా వుంచుకుంటున్నారు. ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు బండి లాగించేస్తున్నారు.

ప్రభాస్ ఈ మధ్య అప్పుడో మూడు రోజులు, ఇప్పుడో మూడు రోజులు ఇలా చేస్తూ వస్తున్నారు. అన్నపూర్ణలో సెట్, అలాగే వేరే సినిమాలకు వేసిన సెట్ లు ఈ సినిమాకు పనికి వస్తాయనుకుంటే అవీ చకచకా వాడేస్తున్నారు. ప్రభాస్ కు కూడా కాస్త గ్రౌండ్ లెవెల్ క్యారెక్టర్ చేసి చాన్నాళ్లయింది. అన్నీ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లే. అందుకే ఈ షూట్ చేయడం ప్రభాస్ కు సరదాగా వుంది. మిగిలిన సెట్ ల్లో అంతా భారీ..భారీ. ఇక్కడ చిన్న హోమ్లీ వాతావరణం వుంటుంది. అది కూడా ప్రభాస్ చకచకా డేట్ లు ఇవ్వడానికి ఓ ప్లస్ పాయింట్ అయింది.

డిసెంబర్ నాటికి మారుతి-పీపుల్స్ మీడియా సినిమా పూర్తయిపోవాలన్నది టార్గెట్. సిజి వర్క్ అవీ ప్రశాంతంగా ఫినిష్ చేసుకుని సమ్మర్ లో విడుదల చేస్తారు. అదే విధంగా డిసెంబర్ నాటికి ప్రస్తుతం ఒప్పుకున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను ఫినిష్ చేసుకుని కొత్త సినిమాలను స్టార్ట్ చేయాలన్నది ప్రభాస్ ఐడియాగా తెలుస్తోంది.