ఊరందరిదీ ఓదారి అన్న సామెతగా వుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవహారం. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కేసిఆర్ ను ప్రశంసిస్తోంది. సినిమా పరిశ్రమ అభివృద్దికి కేసిఆర్ ప్రకటించిన వరాలను మెచ్చుకుంటోంది.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపలేదు. ట్వీటు వేయలేదు. ఆయన రాజకీయ నాయకుడు కదా? ఆయనకు వేరే పార్టీ వుందికదా? ఎలా వేస్తారు అని ఎవరైనా అడగొచ్చు. కానీ పవన్ కూడా సిన్మా హీరోనే. ఇప్పుడు ఆయన దాదాపు అయిదారు సినిమాలకు అడ్వాన్స్ తీసుకుని వున్నారు.
పైగా పవన్ సోదరుడు కాంగ్రెస్ పార్టీ బంధాలు వున్న మెగాస్టార్ చిరంజీవినే ఈ టాలీవుడ్ వరాల కార్యక్రమానికి నడుంబిగించి కదిలారు. మరో సోదరుడు జనసేన పార్టీ నేత నాగబాబు సైతం ట్విట్టర్ లో శభాష్ కేసిఆర్ అన్నంత పని చేసారు. పార్టీ బంధాలతో సంబందం లేకుంటా టాలీవుడ్ పెద్దలు అంతా ట్వీట్లు వేసారు.
మరి పవన్ టాలీవుడ్ హీరో అయి వుండీ, ఆరు సినిమాల కమిట్ అయి వుండీ, కనీసం ఆహ్వానించదగ్గ పరిణామం, మంచి నిర్ణయం అని ఓ మాట అనడానికి ఏమి? పోనీ ఎప్పుడూ అలా అనలేదా అంటే ఆ మధ్యనే వరదబాదతులకు విరాళం ప్రకటిస్తూ, కేసిఆర్ ప్రభుత్వం ప్రొగ్రెసివ్ ప్రభుత్వం అని, ప్రోగ్రెసివ్ లీడర్ షిప్ వుందని మెచ్చుకున్నారు. మరి ఇప్పుడేమొచ్చె? భాజపా ఫీలుతుందనా? ఏమో?