బాబు-లోకేష్..వేదిక మీదకు రావాలి

వారిద్దరు ఓ జాతీయపార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు. ఒక్క రాష్ట్రానికే పరిమితం అయినా, రేండోరాష్ట్రంలొ కూడా ఏదో వున్నాం అనిపించుకుంటూ, తమ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ వుంటారు. కానీ తెలంగాణలో ఒక్క…

వారిద్దరు ఓ జాతీయపార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు. ఒక్క రాష్ట్రానికే పరిమితం అయినా, రేండోరాష్ట్రంలొ కూడా ఏదో వున్నాం అనిపించుకుంటూ, తమ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ వుంటారు. కానీ తెలంగాణలో ఒక్క సీటూ లేదు.వ్యవహారామూ లేదు. 

కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో కట్టిన భారీ పార్టీ ఆఫీసు మాత్రం వుంది. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు వచ్చాయి. అలాంటి తెలుగుదేశం పార్టీకి అథ్యక్ష కార్యదర్శలు అయిన చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఈ ఎన్నికలు వచ్చిన తరువాత ఇప్పటి వరకు మాట్లాడితే ఒట్టు. కేసిఆర్ నో, తెరాస నో విమర్శించనక్కరలేదు. 

కనీసం పోటీ చేస్తామని కానీ, ఇదిగో ఇదీ మా మెనిఫెస్టో అని కానీ, వీళ్లకు టికెట్ లు ఇస్తున్నాం అని కానీ ఒక మాట అంటే ఒట్టు. అంతా చాలా సైలంట్ గా పత్రికా ప్రకటనలతో సరి. హైదరాబాద్ లోనే వుంటున్న చంద్రబాబు, చినబాబు తమ ఇంటికి అత్యంత సమీపంలో వున్న పార్టీ ఆఫీసుకు కూడా రాలేదు. 

అంతా తెలంగాణ నాయకులకు వదిలేసినట్లు కలరింగ్ ఇస్తూ వస్తున్నారు. తాము తెరవెనుకే వుంటూ, తమ మాట వినిపించకుండా, తాము కనిపించకుండా పని కానిస్తున్నారు. దీన్ని కేసిఆర్ అంటే భయం అనుకోవాలా? లేక ఓటమికి ముందు జాగ్రత్త అనుకోవాలా? 

ఇలాంటి టైమ్ లో చంద్రబాబు, లోకేష్ లేదా బాలకృష్ణ కానీ అసలు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? అన్నది కూడా అనుమానంగానే వుంది. ప్రచారానికి మిగిలినవి గట్టిగా అరు రోజులు. 

నిజంగా చంద్రబాబు-లోకేష్ కనుక ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే 150 డివిజన్లు తిరగాలంటే ఈ ఆరు రోజులు చాలవు. కేవలం బి ఫారమ్ లు ఇచ్చి, వారి ఖర్మానికి వదిలేసారు.

ఇదంతా కేసిఆర్ అంటే భయమే అనుకోవాల్సి వస్తోంది. లేదా భాజపాతో లోపాయికారీ అవగాహన అనుకోవాలి.  ఇంకా చిత్రమేమిటంటే తెలంగాణలో వైకాపా యాక్టివ్ గా లేదు. పార్టీని నిర్వహించడం లేదు. కమిటీ లేదు. 

కానీ వైకాపా ఈ ఎన్నికల్లో కాడి వదిలేసింది. మాట్లాడడం లేదు అని వార్తలు రాస్తుంది తెలుగుదేశం అను'కుల'మీడియా. అంతే తప్ప చంద్రబాబు మాట్లాడరేంటీ? ప్రచారం చేయరేంటీ?.

జాతీయ పార్టీ అయి వుండీ 150 స్థానాల్లో పోటీ పెట్టలేకపోవడం ఏంటీ? అని పొరపాటున కూడా ఒక్క వార్త రాయరు. అసలు ఆ విషయమే తెలియనట్లు పట్టనట్లు వుంటారు. ఎంత అవగాహనో మరి?

గ్రేటర్ కొడతాడా? ఇజ్జత్ నిలుస్తుందా?