ఒక్కోసారి ఒక్కొ టెక్నీషియన్ కు టైమ్ వస్తుంది. భీమ్స్ చాలా కాలంగా సంగీతం అందిస్తున్నారు సినిమాలకు. ఎప్పడూ మంచి పాటలే ఇచ్చారు. కానీ ధమాకా తరువాత ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. దీంతో చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి.
స్పెషల్ నేటివ్ మాస్ సాంగ్ కావాలంటే భీమ్స్ తో చేయించాలనే ఐడియాలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు సంపత్ నంది సినిమాలకే కనిపించే భీమ్స్ పేరు ఇప్పుడు స్ఫ్రెడ్ అవుతోంది.
లేటెస్ట్ గా అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా కోసం భీమ్స్ చేత ఓ మాస్ సాంగ్ చేయించారు. వాస్తవానికి ఈ సినిమాకు హిప్ హాప్ తమీజా మ్యూజిక్ డైరక్టర్. అసలు అంతకు ముందు థమన్ ను అనుకున్నారు. కానీ థమన్ బిజీ కావడంతో మార్చారు. సినిమాలో ఒకే ఒక మాస్ సాంగ్ వుంది. అది కచ్చితంగా హిట్ అయి తీరాలి. కానీ హిప్ హాప్ నుంచి సరైన ట్యూన్ రావడం లేదు. సినిమా ఆలస్యం అయిపోతోంది.
ఇలాంటి టైమ్ లో ధమాకా హిట్ కావడం, భీమ్స్ పేరు మారు మోగడం జరిగింది. దాంతో నిర్మాత అనిల్ సుంకర ప్లాన్ మార్చారు. భీమ్స్ చేత ఓ పాట చేయించారు. ఈ పాటను ఇటీవల చిత్రీకరించారు. త్వరలో దాన్ని విడుదల చేస్తారు. ఇప్పటికి విడుదల చేసిన పాటలు పెద్దగా రీచ్ కాలేదు. భీమ్స్ చేసిన పాట మీదనే ఏజెంట్ యూనిట్ చాలా హోప్స్ పెట్టుకుంది.