హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి 'అనుబంధం' గురించి అందరికీ తెలిసిందే. ఏ ఈవెంట్ లో చూసినా ఇద్దరూ కలిసే కనిపిస్తారు. కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటకు చెప్పరు. ఏకంగా విదేశాల్లో కలిసి పర్యటిస్తారు. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటారు.
వీళ్లు తమ రిలేషన్ షిప్ గురించి చెప్పకపోయినా, జనాలు మాత్రం ఫిక్స్ అయిపోయారు. రెగ్యులర్ గా బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ తో కలిసి రీల్స్ పెట్టే అదితి, ఈరోజు అతడితో విదేశాల్లో గడిపిన ఓ మధుర జ్ఞాపకాన్ని షేర్ చేసింది. ఆ వీడియోలో విదేశీ రోడ్లపై సిద్ధూ-అదితి చిన్న పిల్లల్లా గెంతుతూ, డాన్స్ చేస్తున్నారు.
ఈరోజు సిద్దార్థ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ వీడియో పోస్ట్ చేసింది. సిద్దూపై తనకున్న ప్రేమ మొత్తాన్ని శుభాకాంక్షల రూపంలో ఒలకబోసింది అదితి.
మహాసముద్రం సినిమాతో కనెక్ట్ అయ్యారు అదితి-సిద్దార్థ్. అప్పట్నుంచి ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ వస్తున్నారు. ప్రతి ఫంక్షన్ లో కలిసి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధూ వయసు 44 సంవత్సరాలు కాగా, అదితిరావు వయసు 36 ఏళ్లు.