ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సూక్తి ముక్తావళి

యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ లో చాలా మార్పు వచ్చింది. యాక్సిడెంట్ కు ముందు హుషారుగా కనిపించే ఈ హీరో, యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నాడు. తనలోని భక్తిభావాన్ని, తాత్వికతను…

యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ లో చాలా మార్పు వచ్చింది. యాక్సిడెంట్ కు ముందు హుషారుగా కనిపించే ఈ హీరో, యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత పెద్దమనిషి తరహాలో ప్రవర్తిస్తున్నాడు. తనలోని భక్తిభావాన్ని, తాత్వికతను బయటపెడుతున్నాడు.

ఇందులో భాగంగా యువతరానికి ఓ సందేశం అందిస్తున్నాడు సాయితేజ్. అమ్మా, నాన్న, గురువులు గర్వించేలా ఎదగాలని పిలుపునిస్తున్నాడు. అంతేకాదు… ఈ సందర్భంగా అమ్మాయిలకు, అబ్బాయిలకు విడివిడిగా కూడా సందేశం అందించాడు.

ముందుగా అబ్బాయిల విషయానికొస్తే.. ప్రేమించే అమ్మాయిలో తప్ప, మిగతా అందర్లో అమ్మను చూడాలంటున్నాడు. అంతేకాదు, అంతా కలిసి అమ్మాయిలకు ఓ మంచి ప్రపంచం క్రియేట్ చేసిద్దామని కూడా పిలుపునిస్తున్నాడు.

ఇక అమ్మాయిల విషయానికొస్తే.. అబ్బాయిలు అప్పుడప్పుడు తప్పు చేయడం సహజమని, వాళ్లను క్షమించాలని సందేశం అందిస్తున్నాడు. అబ్బాయిలు-అమ్మాయిలంతా కష్టపడి గొప్పవాళ్లు అవ్వాలని కోరుకున్నాడు.

విరూపాక్ష ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇలా సూక్తిముక్తావళి అందుకున్నాడు సాయితేజ్. నిజానికి ఇలాంటి ఫంక్షన్లలో కుర్ర హీరోలెవ్వరూ ఇలాంటి ప్రసంగాలు చేయరు. గతంలో సాయితేజ్ కూడా ఇలాంటి మాటలు చెప్పలేదు. కానీ యాక్సిడెంట్ తర్వాత ఎక్కువగా ఆధ్యాత్మిక, తాత్వికతతో కూడిన అంశాలు, యువతను మేలుకొలిపే కొటేషన్లు వల్లెవేస్తున్నాడు. 

ఇదే ఫంక్షన్ లో తనకు యాక్సిడెంట్ జరిగిన విధానం, ఆ తర్వాత కోలుకున్న విధానం, మానసిక సంఘర్షణ గురించి వివరంగా చెప్పకొచ్చాడు సాయితేజ్. ఇదంతా సింపతీ కోసం చెప్పడం లేదని, యూత్ లో స్ఫూర్తి నింపడానికి చెబుతున్నానని కూడా క్లారిటీ ఇచ్చాడు.